Home /News /jobs /

DELOITTE TO RECRUIT QUALITY ANALYST POSTS IN HYDERABAD THROUGH CAMPUS CONNECT PROGRAM SS

Deloitte: ఫ్రెషర్స్​కు డెలాయిట్ గుడ్​న్యూస్​... హైదరాబాద్​లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Deloitte: ఫ్రెషర్స్​కు డెలాయిట్ గుడ్​న్యూస్​... హైదరాబాద్​లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
(ప్రతీకాత్మక చిత్రం)

Deloitte: ఫ్రెషర్స్​కు డెలాయిట్ గుడ్​న్యూస్​... హైదరాబాద్​లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Deloitte | హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు (IT Jobs) కోరుకునేవారికి అలర్ట్. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన డెలాయిట్ హైదరాబాద్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగంలో నియామకాలు (IT Jobs) వేగవంతమయ్యాయి. అనేక మల్టీ నేషనల్​ కంపెనీలు పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. తాజాగా గ్లోబల్ అకౌంటింగ్ అండ్​ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ నిరుద్యోగులకు (Jobs in Deloitte) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకోనున్నామని తెలిపింది. దీని కోసం క్యాంపస్​ కనెక్ట్ (Campus Connect) పేరుతో కొత్త ప్రోగ్రామ్​ను లాంచ్​ చేసినట్లు వెల్లడించింది. క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ల ద్వారా అన్ని విభాగాల్లో, దేశవ్యాప్తంగా అన్ని క్యాంపస్‌లలో నియామకాలు చేపడుతున్నామని సంస్థ ప్రకటించింది. యువ ప్రతిభావంతులను నియమించుకొని ఐటీ సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొంది.

ప్రస్తుతం హైదరాబాద్​ లొకేషన్​లో క్వాలిటీ​ అనలిస్ట్ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నట్లు డెలాయిట్ తెలిపింది. బీఈ/బీటెక్​/ఎంటెక్​/ఎంసీఏ/బీసీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాల కోసం https://usijobs.deloitte.com/ వెబ్​సైట్​ని సందర్శించవచ్చు.

IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

క్వాలిటీ అనలిస్ట్​ ఉద్యోగానికి కావాల్సిన​ స్కిల్స్​


అభ్యర్థికి ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన ఉండాలి. టెస్టింగ్​ అప్‌గ్రేడ్‌లు/ప్యాచ్‌లపై అవగాహన ఉంటే మంచిది. టెక్నికల్​ స్కిల్స్​తో పాటు డాట్ నెట్​, జావా స్క్రిప్ట్, హెచ్​టీఎంఎల్​, ఎస్​క్యూఎల్, ఎక్స్​ఎమ్​ఎల్​, ఎస్​ఓఏపీ, టీమ్ ఫౌండేషన్ సర్వర్ (TFS) వంటి సాఫ్ట్‌వేర్లు, వెబ్ టెక్నాలజీస్​పై అవగాహన ఉండాలి. ట్రాన్సాక్ట్- SQL (T-SQL), స్టోరేజ్​ప్రొసీజర్స్​పై పనిచేసిన అనుభవం/పరిజ్ఞానం ఉండాలి. టెస్ట్ డైరెక్టర్, క్వాలిటీ సెంటర్ అండ్​ మైక్రోసాఫ్ట్ టెస్ట్ మేనేజర్ (MTM) వంటి మెర్క్యురీ టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌లో అనుభవం ఉంటే మంచిది. దీంతోపాటు UFT (QTP)/కోడెడ్ UI/సెలీనియం వంటి టెస్టింగ్​ టూల్స్​పై అవగాహన ఉండాలి. అదనంగా ఎంటర్‌ప్రైజ్ వైడ్ నెట్‌వర్క్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంటేషన్స్​పై పరిజ్ఞానం అవసరం.

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

విధులు, బాధ్యతలు​


క్వాలిటీ అనలిస్ట్‌గా టీమ్​ డెవలప్‌మెంట్, టెక్నికల్ డెలివరీ మ్యాంగర్స్, ప్రొడక్ట్ ఓనర్స్, యుఎస్ స్టూడియో టీమ్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. క్లెయింట్​కు అవసరమైన టెస్టింగ్​ సర్వీసులను కన్సిస్టెన్సీ, క్వాలిటీ, ఎఫీషియన్సీతో అందించాల్సి ఉంటుంది. క్వాలిటీ టెస్టింగ్​ కోసం అవసరమైన అన్ని ఫంక్షన్లను విశ్లేషించాలి. దీంతోపాటు టెస్టింగ్​ యాక్టివిటీస్​ను ప్లానింగ్​, డెవలప్​​, కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్​ ప్లాన్​, టెస్ట్​ సినారియో, టెస్ట్​ కేసెస్​ను ప్రిపేర్​ చేయడం, టెస్టింగ్ ఎగ్జిక్యూషన్, టెస్టింగ్​ అనాలసిస్​.. వంటి విధులు నిర్వర్తించాలి.

డెలాయిట్‌లో ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో డెలాయిట్ దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Deloitte, JOBS

తదుపరి వార్తలు