• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DELHI VIOLENCE EFFECT CBSE POSTPONED BOARD EXAMS OF CLASS 12TH SCHEDULED ON FEBRUARY 27 FOR NORTH EAST PART OF DELHI SS

CBSE Exams: ఢిల్లీ అల్లర్లు... 10వ, 12వ తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ క్లారిటీ

CBSE Exams: ఢిల్లీ అల్లర్లు... 10వ, 12వ తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ క్లారిటీ

(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Exams | ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల విషయంలో ఉన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చింది బోర్డు.

  • Share this:
    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE పరీక్షలపై ఢిల్లీ అల్లర్లు ప్రభావం చూపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్‌ను ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో సీబీఎస్ఈ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న జరగాల్సిన 12వ తరగతి పరీక్షల్ని కూడా వాయిదా వేసింది సీబీఎస్ఈ. అల్లర్ల ప్రభావం ఉన్న ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో మాత్రమే పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. "ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజ్ఞప్తితో పాటు విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో 2020 ఫిబ్రవరి 27న జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది" అని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.


    ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. కేవలం ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని 80 పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షల్ని ఎప్పటికి వాయిదా వేస్తున్నారో సీబీఎస్ఈ వెల్లడించలేదు. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ ఎలక్టీవ్ (001), ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ (101), ఇంగ్లీష్ కోర్ (301) పరీక్షలు ఉన్నాయి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

    Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    RRB Exam Fees Refund: ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇస్తున్న ఆర్ఆర్‌బీ... వెంటనే వివరాలు అప్‌డేట్ చేయండి
    Published by:Santhosh Kumar S
    First published: