టీచింగ్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఉన్నవారికి గుడ్‌న్యూస్. ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోని గార్గి కాలేజీ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ హోదాలో మొత్తం 100 ఉద్యోగాలను సంస్థ భర్తీ చేయనుంది. ఇందుకు రిక్రూట్‌మెంట్ అథారిటీగా ఢిల్లీ యూనివర్సిటీ వ్యవహరిస్తోంది. అభ్యర్థులు DU అధికారిక వెబ్‌సైట్ colrec.uod.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. అర్హత, జీతం, చివరి తేదీ తదితర పూర్తి వివరాలు తెలుసుకోండి.
మెరిట్ ఆధారంగానే గార్గా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అయితే అభ్యర్థి కింద పేర్కొన్న రెండింట్లోనూ లేదా రెండింటిలో కనీసం ఒకదానిలో అయినా అర్హత పొంది ఉండాలి. మొదటిది.. అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్‌లో 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) లేదా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండోది.. టాప్ 500 అంతర్జాతీయ యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి పీహెచ్‌డీ చేసి ఉండాలి.
* పోస్టుల వివరాలు
బోటనీ విభాగంలో 8 ఖాళీలు, కెమిస్ట్రీ కేటగిరీలో 3 ఖాళీలు, కామర్స్‌లో 17, ఎకనామిక్స్‌లో 10, ఎడ్యుకేషన్‌లో 5, ఇంగ్లీష్‌లో 8, హిందీలో 5, హిస్టరీలో 6, మ్యాథమెటిక్స్‌లో 10, మైక్రోబయాలజీలో 3, ఫిలాసఫీలో 4, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 1, ఫిజిక్స్‌లో 4, పొలిటికల్ సైన్స్‌లో 4, సైకాలజీలో 8, సంస్కృతంలో 1, జువాలజీ విభాగంలో 3 పోస్టులు ఉన్నాయి.
* అప్లికేషన్ ప్రాసెస్
అర్హత ఉన్నవారు colrec.uod.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కాగా, మార్చి 25తో గడువు ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో ఫారం పూర్తి చేసి, చదువు, ఉద్యోగ అనుభవం, ఇతర సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అన్ రిజర్వ్‌డ్ (UR), ఓబీసీ (OBC), ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించక్కర్లేదు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ఫైనల్ కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
ఇది కూడా చదవండి :ఐఐటీ మద్రాస్ డేటాసైన్స్ కోర్సుకు మంచి డిమాండ్.. ఈ ఏడాది అప్లికేషన్స్ ప్రారంభం
* ఎంపిక ప్రక్రియ
అప్లై చేసుకున్న అభ్యర్థుల అర్హతలు చెక్ చేసి షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు ఫొటో ఐడీతో పాటు విద్య , ఇతర అర్హతలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు, సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలతో హాజరవ్వాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,700 ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS