హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Delhi University: అనాథలకు అండగా ఢిల్లీ యూనివర్సిటీ.. ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు ప్రకటన

Delhi University: అనాథలకు అండగా ఢిల్లీ యూనివర్సిటీ.. ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు ప్రకటన

ఢిల్లీ యూనివర్శిటీ

ఢిల్లీ యూనివర్శిటీ

ఈ రోజుల్లో చదువు వ్యాపార వస్తువుగా మారిపోయింది. లక్షల్లో ఫీజులు చెల్లిస్తే కానీ నాణ్యమైన విద్య అందడం లేదు. అయితే ఢిల్లీ యూనివర్సిటీ అనాథలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Delhi University: ఈ రోజుల్లో చదువు వ్యాపార వస్తువుగా మారిపోయింది. లక్షల్లో ఫీజులు చెల్లిస్తే కానీ నాణ్యమైన విద్య అందడం లేదు. అయితే ఢిల్లీ యూనివర్సిటీ(DU) అనాథలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. అనాథ విద్యార్థులకు ఉచితంగా సీట్లు(Free seats to students) కేటాయించాలని నిర్ణయించింది. విద్యార్థులకు అడ్మిషన్ నుంచి కోర్సు పూర్తయ్యే వరకు పూర్తి ఖర్చును యూనివర్సిటీ భరించనుంది. ఈ గొప్ప నిర్ణయాన్ని విద్యా నిపుణులు స్వాగతిస్తున్నారు.

ప్రతి కోర్సులో 2 సీట్లు

యూనివర్సిటీ అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లోని అన్ని కోర్సుల్లో రెండు సీట్లను ఉచితంగా కేటాయించనుంది. సూపర్ న్యూమరరీ కోటా కింద అనాథ విద్యార్థులకు అదనంగా రెండు సీట్లలో ప్రవేశాలు కల్పించనుంది. అంటే నియమిత సంఖ్యకు మించి అదనంగా రెండు సీట్లను ప్రతి సీటులో కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ నెల 4న జరిగిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు లన్నింటిలో రెండు సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నింటిలో రెండు సీట్లు అనాథలకు కల్పించనున్నట్లు తీర్మానం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ తీర్మానాన్ని అమలులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది.

అన్ని ఫీజులు మాఫీ

కళాశాలలో సీట్ల కేటాయింపును యథాతథంగా చేపట్టనుంది. అయితే, అనాథ విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా రెండు సీట్లను పెంచింది. ఈ కోటా కింద అనాథ విద్యార్థులకు రెండు సీట్లు కేటాయించింది. అడ్మిషన్ ప్రక్రియ నుంచి కోర్సు పూర్తి చేసే వరకు విద్యార్థికి ఎలాంటి ఖర్చు ఉండకుండా చేసింది. మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు, కోర్సు ఫీజు, పరీక్ష ఫీజు తదితర ముఖ్యమైన ఫీజు లన్నింటినీ విద్యార్థి చెల్లించనవసరం లేదని యూనివర్సిటీ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యార్థికి ఎలాంటి భారం ఉండకుండా కోర్సును పూర్తిగా ఉచితంగానే అందించనున్నట్లు తెలిపారు.

GK Questions: పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారా? ఈ GK క్వశ్చన్స్‌కి ఆన్సర్‌ తెలుసా?

యూనివర్సిటీ ఫండ్

యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది అనాథ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతిభ ఉన్నప్పటికీ ఖర్చులకు వెనుకాడి చాలామంది యూనివర్సిటీ స్థాయి విద్యను పొందలేక పోతున్నారు. అలాంటి వారికి ఈ నిర్ణయం ఎంతో దోహద పడనుంది. నచ్చిన కోర్సును ఉచితంగా ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని కల్పించి యూనివర్సిటీ మరింత సౌలభ్యాన్ని ఇచ్చింది. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి కోర్సు పూర్తి చేసే వరకు విద్యార్థులకు అయ్యే ఖర్చును యూనివర్సిటీ వెల్ఫేర్ ఫండ్(University Welfare Fund) భరించనుంది. లేదా, కళాశాల విద్యార్థుల సంక్షేమ నిధి(College Students Welfare Fund) ద్వారా విద్యార్థులకు ఖర్చు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.

ఈ సమస్యలు కూడా

ఈ నిర్ణయంతో పాటు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో మరికొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు అధికారి ఒకరు తెలిపారు. అడ్ హక్(తాత్కాలిక) అధ్యాపక సిబ్బందిని నియమించుకోవడంపై సమగ్రంగా చర్చ జరిగినట్లు తెలిపారు. టీచర్లను ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని కూడా నియంత్రించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ‘టీచర్లను అటు, ఇటు మార్చడాన్ని తగ్గించాలని మేం కోరాం. అదే విధంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని డిమాండ్ చేశాం’ అని కౌన్సిల్ సభ్యులు సీమా దాస్ వెల్లడించారు.

First published:

Tags: Career and Courses, Delhi University, EDUCATION, JOBS

ఉత్తమ కథలు