హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Delhi University jobs 2021: యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లో 251 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

Delhi University jobs 2021: యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లో 251 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

ఢిల్లీ యూనివ‌ర్సిటీ

ఢిల్లీ యూనివ‌ర్సిటీ

University of Delhi Recruitment 2021 : ఢిల్లీలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ప‌లు టీచింగ్ (Teaching) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 251 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 20, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఢిల్లీలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీ (University of Delhi)లో ప‌లు టీచింగ్ (Teaching) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఆఫ్రీక‌న్ స్ట‌డీస్‌, ఆంథ్రోపాల‌జీ, బ‌యో ఫిజిక్స్‌ (Bio Physics), కెమిస్ట్రీ (Chemistry) ఇలా 38 విభాగాల‌కు చెందిన స‌బ్జెక్టుల‌కు సంబంధించి టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 251 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 20, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు రుసుం (Exam Fee) రూ.500 ఉంటుంది. అభ్య‌ర్థులను ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్ సంబంధిత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ ను సంద‌ర్శించాలి.

  ముఖ్య‌మైన స‌మాచారం

  పోస్టు పేరుఅసిస్టెంట్ ప్రొఫెస‌ర్
  మొత్తం ఖాళీలు251 (UR-90 SC-38 ST-20 OBC-69 EWS-25 PwBD -9)
  ద‌ర‌ఖాస్తు ఫీజురూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష ఫీజు మిన‌హాయింపు
  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 20, 2021


   DRDO Recruitment 2021 : డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో 90 అప్రెంటీస్ పోస్టులు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం  ఎంపిక విధానం

  Step 1: ద‌ర‌ఖాస్తుల‌ను స్కీనింగ్ క‌మిటీ స‌మీక్షీస్తుంది.

  - అక‌డామిక్ స్కోర్‌ (Academic Score) కి 80 మార్కులు

  - రీస‌ర్చ్ ప‌బ్లికేష‌న్‌కుఇ 20 మార్కులు

  - టీచింగ్ ఎక్సీపీరియ‌న్స్‌కు 10 మార్కులు కేటాయించి అభ్య‌ర్థికి మార్కులు ఇస్తారు.

  Step 2: వ‌చ్చిన మార్కుల ఆధారంగా క‌మిటీ అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ (Short list) చేస్తుంది.

  Step 3: ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (Interview) నిర్వ‌హిస్తారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1: ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించాలి.

  - ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  ISRO Courses : గ్రాడ్యుయేట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఇస్రోలో రిమోట్‌సెన్సింగ్‌పై రెండు నెల‌ల‌ కోర్సుకు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం  Step 2: అనంత‌రం ఆన్‌లైన్ విండోలో ద‌ర‌ఖాస్తు ఫాంను నింపాలి.

  Step 3: ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన అనంత‌రం ఫీజు చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష ఫీజు మిన‌హాయింపు.

  Step 4: ద‌ర‌ఖాస్తు అనంత‌రం అప్లికేష‌న్ (Application Form) ఫాం హార్డుకాపీ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

  Step 5: ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 20, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Delhi, Delhi University, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు