హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో ఆరు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభం.. ఆ విద్యార్థులకు మాత్రమే..!

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో ఆరు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభం.. ఆ విద్యార్థులకు మాత్రమే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ ఆరు కొత్త జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించింది. అర్హతలకు తగిన ఉద్యోగాలను త్వరగా సంపాదించడానికి అవసరమైన స్కిల్స్ ఈ కోర్సుల ద్వారా అందిస్తారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల కాలంలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు (Job Oriented Course)లకు డిమాండ్ పెరిగింది. అర్హతలకు తగిన ఉద్యోగాలను త్వరగా సంపాదించడానికి అవసరమైన స్కిల్స్ ఈ కోర్సుల ద్వారా అందిస్తారు. దీంతో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇలాంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) కూడా ఆరు కొత్త జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించింది. అయితే యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (SOL) విద్యార్థుల కోసం మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్(SOL) 60 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కొత్త కోర్సులను ప్రారంభించారు.

* కోర్సుల వివరాలు

జాబ్-ఓరియంటెండ్ ఆరు కొత్త కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి.

1. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

2. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనాలసిస్)

3. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్

4. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్- ఎకనామిక్స్ (హానర్స్)

5. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్

6. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్

ఈ కోర్సులను ప్రారంభించిన సందర్భంగా ఓపెన్ లెర్నింగ్ క్యాంపస్ డైరెక్టర్ పాయల్ మాగో మాట్లాడుతూ.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆమోదించిన తరువాతనే ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ‘BBA, MBAలో ఇవి చాలా ముఖ్యమైన కోర్సులు. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అనేది ఢిల్లీ యూనివర్సిటీలో చాలా ప్రతిష్టాత్మకమైన కోర్సు . ఇక్కడ మేనేజ్‌మెంట్, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి :ఇంగ్లీష్ రాకున్నా ఓకే.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు రెగ్యులర్ మోడ్‌లో ఎకనామిక్ కోర్సులలో అడ్మిషన్ పొందలేకపోతున్నారు. దీంతో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్-ఎకనామిక్స్ కోర్సును ఓపెన్ లెర్నింగ్ విధానంలో ప్రవేశపెట్టాం. ఇది ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కోర్సు.’ అని పాయల్ పేర్కొన్నారు. విద్యార్థులకు జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ఈ కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ అధికారిక వెబ్‌సైట్ sol.du.ac.inను సందర్శించాలని ఇన్‌స్టిట్యూట్ సూచించింది.

స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో ఆరు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మొదటి కోర్సు కాగా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్-ఎకనామిక్స్(ఆనర్స్), బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి ఐదు కోర్సులను ప్రారంభించామన్నారు. విద్యార్థులు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని యోగేష్ ఆకాంక్షించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Delhi, EDUCATION, JOBS

ఉత్తమ కథలు