Delhi University: ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేయాలనే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గుడ్‌న్యూస్. ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) వివిధ డిపార్ట్మెంట్స్/సెంటర్లలో పనిచేసేందుకు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్(Internship) అవకాశం కల్పించింది. ఈ మేరకు ‘ఢిల్లీ యూనివర్సిటీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2022’ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీన్ని వైస్-ఛాన్సలర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. అర్హులైన అభ్యర్థులు యూనివర్సిటీకి చెందిన డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ పోర్టల్ dsw.du.ac.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాగా, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 11గా నిర్ణయించారు.
అర్హత ప్రమాణాలు
ఇది పార్ట్-టైమ్ ఇంటర్న్‌షిప్. వారానికి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఫ్లెక్సిబుల్ వర్క్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ గరిష్ట వ్యవధి ఆరు నెలలు. ఢిల్లీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్లో ఏదైనా కోర్సు/స్ట్రీమ్ చదువుతున్న బోనఫైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఈ ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుంది. ఈ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో విద్యార్థులు ఒకసారి మాత్రమే వైస్ ఛాన్సులర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ (VCIS) పొందడానికి అవకాశం ఉంటుంది.
ఈ డొమైన్స్‌లో ఇంటర్న్‌షిప్
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వివిధ డొమైన్స్‌లో అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ప్రధానంగా వైస్ ఛాన్సలర్ ఆఫీస్, ప్రో వైస్ ఛాన్సలర్ ఆఫీస్, కాలేజీల డీన్ ఆఫీస్, డైరెక్టర్ సౌత్ క్యాంపస్ ఆఫీస్, ప్రొక్టర్ ఆఫీస్, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్, రిజిస్ట్రార్ ఆఫీస్ సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీ, సైన్స్ లైబ్రరీ, డిపార్ట్మెంటల్ లైబ్రరీలు, డిపార్ట్మెంటల్ ల్యాబ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, అడ్మిషన్ బ్రాంచ్, రీసెర్చ్ కౌన్సిల్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ (రీడర్స్-రైటర్స్ ఫర్ విజువలీ ఛాలెంజ్) క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, WSDC, సెంటర్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్ వంటి డొమైన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేయడానికి ఢిల్లీ యూనివర్సిటీ అవకాశం కల్పించింది.
సమ్మర్ ఇంటర్న్‌షిప్ వివరాలు..
ఈ స్కీమ్ ద్వారా సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ను కూడా యూనివర్సిటీ అందిస్తుంది. డీయూలో ఏదైనా కోర్సులో ఫుల్-టైమ్ రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులందరికీ ఈ ఇంటర్స్షిప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, ప్రతి కేటగిరీలో మొత్తం ఇంటర్న్‌ల సంఖ్యను 200కు పరిమితం చేశారు. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఎనిమిది వారాల పాటు వేసవి సెలవుల్లో ఉంటుంది. విద్యార్థులకు నెలకు రూ. 10,000 స్టైఫండ్ లభిస్తుంది. ఒకవేళ సమ్మర్ ఇంటర్న్ షిప్‌ను అకడమిక్ సమయంలో నిర్వహిస్తే.. విద్యార్థులకు వారానికి రూ.5000 స్టైఫండ్ చెల్లించనున్నారు.
రికమండేషన్ లెటర్ తప్పనిసరి
అభ్యర్థులందరూ ఇంటర్న్‌షిప్ కోసం ఇంటర్వ్యూ సమయంలో లెటర్‌హెడ్‌పై డిపార్ట్మెంట్ లేదా ఇన్స్టిట్యూషన్ లేదా కాలేజ్ లేదా సెంటర్ హెడ్ నుంచి రికమండేషన్ లెటర్‌ను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ, ఈ లెటర్ ఆధారంగా ఉంటుందని యూనివర్సిటీ పేర్కొంది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసే అభ్యర్థులకు సంబంధిత ఎంప్లాయింగ్ డిపార్ట్మెంట్ /సెంటర్స్/ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్... సర్టిఫికేట్ ప్రదానం చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi University, Internship