హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exams 2021: పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సిన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు.. వివరాలివే

Exams 2021: పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సిన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు.. వివరాలివే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే విద్యార్థులందరికీ ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిల్ లో కోరారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో 2021 ఏడాదికి జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేశాయి చాలా రాష్ట్రాలు. ముఖ్యంగా 12వ తరగతి లేదా ఇంటర్ బోర్ట్ పరీక్షలైతే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాయిదా పడ్డాయి. అయితే, రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడం అంత సురక్షితం కాదని.. ఒకవేళ నిర్వహిస్తే విద్యార్థులందరికీ ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిందిగా జ్యోతి అగర్వాల్, సంజీవని అగర్వాల్, ప్రదీప్ షెకావత్ అనే ముగ్గురు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ యువకులపై కూడా దాడి చేస్తున్నందున.. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అత్యవసర ప్రాతిపదికన విద్యార్థులకు టీకాలు వేయాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కోరుతూ నోటీసులు జారీ చేసింది.

Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు.. వివరాలివే

Online Courses: కరోనా నేపథ్యంలో ఆ ఆన్‌లైన్ కోర్సులకు అత్యంత ఆదరణ.. చేరేందుకు పోటీలు పడుతున్న చిన్నారులు.. వివరాలివే..

18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ వేయవచ్చా?

ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2021 ఏడాదికి గాను బోర్డు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడంపై సాధ్యాసాధ్యాలను తెలపాలని కోరింది. దీంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ చైర్మన్ సంతోష్ కె త్రిపాఠి, కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ మోనికా అరోరా హైకోర్టుకు తెలిపారు.

అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్లను ఇవ్వవచ్చా? మెడికల్ నిబంధనలు ఏమి చెబుతున్నాయి? వారికి వాక్సిన్ వేయడం సురక్షితమేనా? అనే వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే1 నుంచి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. వాక్సిన్ డోసుల కొరత కారణంగా అనేక రాష్ట్రాల్లో ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

First published:

Tags: Corona, Covid-19, Delhi High Court, Exams, Exams postponed, High Court

ఉత్తమ కథలు