Fellowship: అర్బన్​ లీడర్స్​ ఫెలోషిప్ ప్రారంభించిన ప్రభుత్వం.. ఎంపికైతే నెలకు రూ. 1.25 లక్షలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ తాజాగా చీఫ్ మినిస్టర్స్ అర్బన్ లీడర్స్ ఫెలోషిప్ (CMULF)ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా చీఫ్ మినిస్టర్స్ అర్బన్ లీడర్స్ ఫెలోషిప్ (CMULF)ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఫెలోషిప్​కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ .1,25,000, అసోసియేట్ ఫెలోలకు రూ .75 వేల వేతనం లభిస్తుంది. యంగ్​ లీడర్స్​ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి, పట్టణాల్లోని సవాళ్లను పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 ఆగస్టు 9లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ ఫెలోఫిప్​ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాల కోసం www.ddc.delhi.gov.in/cmulf వెబ్​సైట్​ను సందర్శించాలని తెలిపింది.
IGNOU: 2021-22 విద్యా సంవత్సరానికి ఇగ్నో కొత్త కోర్సులు.. దూర విద్య ద్వారా సర్టిఫికేట్లు
Telangana Student: పదిహేడేళ్ల వయసులోనే తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల బంపర్ ఆఫర్.. అంతేకాదు..

ఎంపికైన వారు ఏం చేయాలి?
ఎంపికైన వారు వివిధ విభాగాలలో ఆయా మంత్రుల పర్యవేక్షణలో నేరుగా పని చేస్తారు.
విధానాలను రూపొందించడానికి, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలు కోసం మంత్రులు లేదా సీనియర్ అధికారులతో కలిసి పని చేస్తారు.

ఫెలోస్​ అర్హత ప్రమాణాలు
-దరఖాస్తు చేసే అభ్యర్థికి పీహెచ్​డీ పూర్తి చేసి కనీసం ఏడాది పాటు రీసెర్చ్​ అనుభవం ఉండాలి. లేదా పీజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
-సీఎ/ సీఎస్, మొదలైన ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసి సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
-కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

అసోసియేట్ ఫెలోస్ అర్హత
-కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తో పాటు ఏడాది పని అనుభవం.
సీఎ/ సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసి సంబంధిత విభాగంలో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
-కనీసం 60 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
స్టెప్​ 1: ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసిన వారిలో నుంచి విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఇంటర్వూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
స్టెప్​ 2: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఫేస్​ టు ఫేస్​ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది ప్రభుత్వ అధికారులు, నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Published by:Nikhil Kumar S
First published: