హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Schools closed: రాజధానిలో వారం పాటు పాఠశాలలు బంద్​.. ఆఫీసులకు తాళాలు.. ఇంటి నుంచే పని.. ముఖ్యమంత్రి ప్రకటన

Schools closed: రాజధానిలో వారం పాటు పాఠశాలలు బంద్​.. ఆఫీసులకు తాళాలు.. ఇంటి నుంచే పని.. ముఖ్యమంత్రి ప్రకటన

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

రాజధాని నగరంలో ఇక నుంచి ఆన్​లైన్​లోనే తరగతులు జరగనున్నాయి. అంతేకాకుండా వ్యాపార, నిర్మాణ తదితర పనులన్నీ నిలిపివేయాలని సీఎం ఆదేశించారు.

దేశ రాజధాని (capital)లో సోమవారం నుంచి వారంపాటు స్కూళ్లు మూసివేస్తున్నట్లు (schools closed) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ (Delhi CM Aravind Kejriwal)​ ప్రకటించారు. విద్యార్థులకు పూర్తిగా ఆఫ్​లైన్​ తరగతులను (Offline classes) నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇక నుంచి ఢిల్లీలో వారంపాటు ఆన్​లైన్​లోనే తరగతులు (Virtual classes) జరగనున్నాయి. అంతేకాకుండా వ్యాపార, నిర్మాణ (Constructions) తదితర పనులన్నీ నిలిపివేయాలని శనివారం సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయ సిబ్బందికి వర్క్​ ఫ్రం హోం (Work from home) సదుపాయం కేటాయించారు.  ఈ మేరకు సీఎం కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు 100% సామర్థ్యంతో ఇంటి నుంచి (WFH) పనిచేస్తాయి. వీలైనంత వరకు WFH ఎంపికకు వెళ్లాలని ప్రైవేట్ కార్యాలయాలకు (Private offices) సలహా ఇస్తున్నాం. నవంబర్ 14-17 మధ్య నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి లేదు. సోమవారం నుంచి ఒక వారం పాటు (One week) పాఠశాలలు భౌతికంగా (physically) మూసివేయబడతాయి (closed), వర్చువల్‌గా కొనసాగించబడతాయి, తద్వారా పిల్లలు కలుషితమైన గాలిని పీల్చుకోవలసిన అవసరం లేదు.” అన్నారు. అయితే ఒక్కసారిగా ఢిల్లీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. వాతావరణ కాలుష్యం (Weather pollution) కారణంగా.

అత్యంత ప్రమాదకర స్థాయికి..

ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి మరింత తర్వాత పరిస్థిితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. 2 రోజుల పాటు లాక్‌డౌన్ (Delhi Lockdown) విధించయినా సరే కాలుష్యాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. AQI 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.

ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై శనివారం సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఢిల్లీ ప్రజలు ఇళ్లల్లోనూ మాస్క్ ధరించే దారుణ పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాలా? కాలుష్యం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 500గా ఉన్న AQI (Air Quality Index) ని 200కి తగ్గించాలంటే మన వద్ద ఉన్న మార్గాలేంటి? 2 రోజులు లాక్‌డౌన్ విధిస్తారా? ఇంకేదైనా చేస్తారా? ఏమైనా చేయండి.కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోండి. ''' అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వారం పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. (కాలుష్యం) పరిస్థితి అధ్వాన్నంగా మారితే ఢిల్లీలో పూర్తి లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సూచన ఉంది. ప్రతిపాదనను రూపొందిస్తున్నాం. కేంద్రం, ఏజెన్సీలతో చర్చిస్తాం. ఇది జరిగితే, నిర్మాణాలు, వాహనాల రాకపోకలు నిలిపివేయవలసి ఉంటుంది” అన్నారు.

First published:

Tags: Aravind Kejriwal, Delhi pollution, Online classes, Schools close

ఉత్తమ కథలు