సాంకేతికత(Technology) వినియోగం అన్ని రంగాల్లోనూ పెరుగుతోంది. ఆయా రంగాల్లో విధులను నిర్వర్తించేందుకు నైపుణ్యాలు(Skills) ఉన్న అభ్యర్థులు అవసరం అవుతున్నారు. రియల్ ఎస్టేట్(Real Estate), నిర్మాణ పరిశ్రమలో పని చేసే వారు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టడం అత్యవసరం. ఇంజినీరింగ్(Engineering), ఆర్కిటెక్చర్ లేదా ఇతర సంబంధిత రంగాలను చదివిన తర్వాత పరిశ్రమలో చేరాలని కోరుకునే వారు పరిశ్రమల్లో వస్తున్న మార్పులు, మార్కెట్(Market) అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ప్రతిభ(Talent) ఉన్న వారికి మంచి అవకాశాలను అందించే రంగం ఇది. అత్యుత్తమ స్థాయి ఉన్నవారికి అత్యుత్తమ ప్రతిఫలాన్ని అందించే పరిశ్రమ. పరిశ్రమలో మారుతున్న అవసరాల ఆధారంగా పనిచేసేందుకు నిపుణులు అవసరం.
వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో నిర్మాణ రంగానికి సంబంధించిన గుర్తింపు పొందిన డిగ్రీ విజయాలను అందిస్తుంది. ఎందుకంటే నిర్మాణ రంగంలో గుర్తింపు పొందిన డిగ్రీలు కలిగి ఉన్నవారు మాత్రమే కొత్త తరం అభిరుచులు, అవసరాల మేరకు నిర్మాణాలు చేయడం, రూపకల్పన చేయడం చేయగలరు.
* గ్లోబల్‌గా గుర్తింపు పొందిన డిగ్రీని పొందడం ఎందుకు ముఖ్యం?
విద్య నాణ్యత: ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు, అనుభవాన్ని డిగ్రీలు అందిస్తాయి. కొత్త పాఠ్యాంశాలు, పరిశ్రమ నిపుణుల నుండి ఇన్‌పుట్‌లు, అసైన్‌మెంట్‌లు విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందిస్తాయి.
చార్టర్డ్ ప్రొఫెషనల్:
గ్రాడ్యుయేషన్ తర్వాత.. విద్యార్థులు 'MRICS' (RICS సభ్యుడు లేదా రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఛార్టడ్ సర్వేయర్స్) అర్హత సాధించడానికి అవసరమైన రెండు సంవత్సరాల వ్యవధిలో తమను తాము ట్రైనీ సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా వారి కెరీర్‌లో మరింత ఎదగడానికి అవకాశం ఉంది. కొంతమంది అంతర్జాతీయ రిక్రూటర్‌లు బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ జాబ్ కోసం MRICS కావాలని నిబంధన విధిస్తారు.
ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజర్:
విద్యార్థులు సెమిస్టర్ కోసం విదేశాలలో చదువుకోవడం, అంతర్జాతీయ వేసవి కార్యక్రమంలో పాల్గొనడం మరియు అంతర్జాతీయ ట్రావెలింగ్ స్టూడియోలలో పని చేయడం ద్వారా వివిధ మార్గాల ద్వారా అనుభవాన్ని పొందుతారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లన్నీ వినియోగదారులను ఇతర విద్యావేత్తలు, విద్యార్థులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి, దృక్పథాన్ని సంపాదించడానికి, అంతర్జాతీయ ప్రమాణాలను తెలుసుకునేందుకు, వ్యక్తులుగా ఎదగడానికి ఉపయోగపడుతాయి. అంతేకాకుండా గ్లోబల్ అక్రిడిటేషన్ అంటే ప్రముఖ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందజేసే ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్‌లతో సమానంగా ఉండే ప్రోగ్రామ్.
గ్లోబల్ ఎంప్లాయబిలిటీ:
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రామ్ ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ డిగ్రీలు ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీస్ చేసిన నైపుణ్యాల ఆధారంగా గుర్తింపు పొందినందున, విద్యార్థులు అంతర్జాతీయ ప్రదేశాలలో ప్రపంచ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనేక అవకాశాలను పొందుతారు. పరిశ్రమ మార్గాలు, అవసరాల ప్రకారం నైపుణ్యం సాధించగలరు.
వ్యాపారానికి సహాయం చేయడానికి అనేక ప్రభుత్వ కార్యక్రమాల మద్దతుతో, భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2040 నాటికి రూ.65,000 కోట్ల విలువైన మార్కెట్‌ను కలిగి ఉంటుందని అంచనా. నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్‌లు, క్వాంటిటీ సర్వేయర్‌లు, కాస్ట్ మేనేజర్‌లు, వాల్యూయర్‌లు, సేల్స్, మార్కెటింగ్ స్పెషలిస్ట్‌లు, ఇతర పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న వ్యక్తులకు అధిక డిమాండ్ ఉంటుంది.
రియల్ ఎస్టేట్ పరిశ్రమకు 2022 ఒక ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నారు. నివాస రంగం మూలధన విలువ 5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. కొత్త గృహ కొనుగోలుదారులకు పెద్ద గృహాలు, మెరుగైన సౌకర్యాలు, మెరుగైన ధరల వైపు మొగ్గు చూపుతున్నారు. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ కూడా ఈ ఏడాది వృద్ధి చెందుతుందని అంచనా. ఇది ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగే ట్రెండ్. నిస్సందేహంగా బిల్ట్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ చేతుల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీ ఉంటే పోటీలో ముందుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.