విద్యార్థులకు గుడ్ న్యూస్... జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు.. ప్రశ్నపత్రంలోనూ మార్పులు

వాస్తవానికి కరోనా నేపథ్యంలో తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షలను ముందుగా నిర్వహించాలని అధికారులు భావించారు.కానీ దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండడంతో అన్ని పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించారు

news18-telugu
Updated: May 13, 2020, 6:37 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్... జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు.. ప్రశ్నపత్రంలోనూ మార్పులు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల అన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలన్నింటినీ ఒకేసారి నిర్వహించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి కరోనా నేపథ్యంలో తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షలను ముందుగా నిర్వహించాలని అధికారులు భావించారు.కానీ దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండడంతో అన్ని పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అన్ని వర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇవ్వనుంది. జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు వ్యక్తిగత దూరం పాటించేలా చూడనున్నారు. పీజీ ప్రవేశాలకు డిగ్రీ ఫలితాలకు సంబంధం ఉన్న నేపథ్యంలో తొలుత తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రంలోని యూనివర్సిటీలు భావించాయి.

అయితే కేవలం ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో గత రెండు సంవత్సరాల్లో ఫెయిలైన సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రశ్నపత్రంలోనూ మార్పులు చేసేందుకు నిర్ణయించారు. ప్రశ్నల సంఖ్యను తగ్గించడంతో పాటు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకుగతంలో కన్నా ఎక్కువ మార్కులు కేటాయించనున్నారు. అయితే పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తామని ఓయూ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వల్ల యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్ష సమయాన్ని రెండు గంటలకు తగ్గించనున్నట్టు ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
First published: May 13, 2020, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading