Education News: విద్యార్థులకు అలర్ట్... 5 లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ ఇవే

Education News | డిగ్రీ, పీజీ పరీక్షల నుంచి గురుకుల కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్స్ వరకు 5 ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: July 8, 2020, 11:54 AM IST
Education News: విద్యార్థులకు అలర్ట్... 5 లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ ఇవే
Education News: విద్యార్థులకు అలర్ట్... 5 లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో విద్యారంగం కూడా గాడిలో పడుతోంది. పెండింగ్‌లో ఉన్న పరీక్షల్ని నిర్వహించడం దగ్గర్నుంచి కాలేజీల్లో అడ్మిషన్స్ వరకు అనేక కార్యకలాపాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ ఉండటంతో పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కాలేజీల్లో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు విద్యా సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 5 లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ తెలుసుకోండి.

1. డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీడిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని సెప్టెంబర్ చివరిలోగా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆగస్ట్ మూడో వారంలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టులో పరీక్షల్ని ముగిస్తే సెప్టెంబర్ లోగా ఫలితాలు విడుదలవుతాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి-TSCHE త్వరలో యూనివర్సిటీలతో సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. పరీక్షల్ని ఆఫ్‍లైన్‌లోనే నిర్వహించే అవకాశముంది.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

2. కేంద్రీయ విద్యాలయ సంచలన నిర్ణయం


ఫెయిల్ అయిన 9, 11వ తరగతి విద్యార్థుల్ని ప్రమోట్ చేయాలని కేంద్రీయ విద్యాలయ నిర్ణయించింది. వారికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గతంలో అయితే ఈ రెండు క్లాసుల విద్యార్థులు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉండేది. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితేనే 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతిలో, 11వ తరగతి విద్యార్థులకు 12వ తరగతిలో ఎంట్రీ ఉండేది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించడం సాధ్యం కావట్లేదు. దీంతో వారిని ప్రమోట్ చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయించింది. అయితే వారికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చే నెక్స్ట్‌ క్లాస్‌కు ప్రమోట్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ ఐదు సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అయినట్టైతే ప్రాజెక్ట్ వర్క్, వచ్చిన మార్కుల ఆధారంగా నెక్స్ట్‌ క్లాస్‌కు ప్రమోట్ చేస్తారు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 426 పోస్టులు... ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ

3. గురుకుల కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు


తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 పరీక్షకు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది TREIS. తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.

Police Jobs: డిగ్రీ పాసైనవారికి 1564 పోలీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

 

4. సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ


కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్‌ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

5. ఆన్‌లైన్ క్లాసులపై కేంద్రం గైడ్‌లైన్స్


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. ఈ విషయంలో అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానాన్ని రూపొందించకపోవడం పలు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ అంశంపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో... అసలు ఆన్‌లైన్ క్లాసుల విషయంలో కేంద్రం వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్రం ఉందని... జులై 15న వీటిని విడుదల చేసే అవకాశం ఉందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ శంకర్ నారాయణ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన విచారణను మద్రాస్ హైకోర్టు జులై 20కు వాయిదా వేసింది.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading