Degree and PG Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే...

Telangana Degree and PG Exams: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను తెరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం... డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.

news18-telugu
Updated: August 29, 2020, 7:28 AM IST
Degree and PG Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే...
Degree and PG Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే...
  • Share this:
Degree and PG Exams: డిగ్రీ, పీజీ పరీక్షల్ని ఎలాగైనా జరపాల్సిందేనని ఆదేశాలు రావడంతో... తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి వీడియో కాన్ఫరెన్స్ జరిపింది. సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే బెటరనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ లోగా కరోనా కేసులు తగ్గుతాయనీ అదే సమయంలో... పరీక్షలకు ఏర్పాట్లు చేసేందుకు కూడా రెండు వారాల టైమ్ సరిపతుందని చాలా మంది చెప్పారు. దాంతో... అప్పుడే నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను యూనివర్సిటీలు ప్రకటిస్తాయంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. పీజీ, డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను అక్టోబర్‌లో జరపాలనీ, ఇందుకు UGC పర్మిషన్ తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మొత్తానికి కరోనా కారణంగా ఆగిపోయిన పరీక్షలు ఇప్పుడు తప్పనిసరిగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో పరీక్షలకు పూర్తిగా ప్రిపేరైన విద్యార్థులు... ఇప్పుడు మళ్లీ రివైండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నెక్ట్స్ లెవెల్ సబ్జెక్టులు చదవాల్సిన సమయంలో... గతేడాది చదువునే రివైండ్ చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరమే.
Published by: Krishna Kumar N
First published: August 29, 2020, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading