DRDO Jobs: డీఆర్‌డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO Recruitment 2019 | బయోడేటాను అక్టోబర్ 18 లోగా mohiths@npol.drdo.in ఇ మెయిల్ ఐడీకి దరఖాస్తు పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసినవాళ్లు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 17, 2019, 2:52 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ
DRDO Jobs: డీఆర్‌డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ (image: DRDO)
news18-telugu
Updated: September 17, 2019, 2:52 PM IST
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO సంస్థలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే బెంగళూరులోని ల్యాబరేటరీ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-ADE కోసం 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది డీఆర్‌డీఓ. ఆ తర్వాత మరో 224 పోస్టుల్ని ప్రకటించింది. ఇప్పుడు కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీ కోసం జేఆర్ఎఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. వేర్వేరు విభాగాల్లో మొత్తం 6 ఖాళీలున్నాయి. బయోడేటాను అక్టోబర్ 18 లోగా mohiths@npol.drdo.in ఇ మెయిల్ ఐడీకి దరఖాస్తు పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసినవాళ్లు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

drdo recruitment, drdo recruitment 2019, drdo recruitment 2019 for engineers, drdo recruitment 2019 apply online, drdo recruitment through gate 2019, www.drdo.gov.in recruitment 2019, drdo jrf recruitment 2019, drdo jrf mechanical, Defence Research and Development Organization, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ 2019, డీఆర్‌డీఓ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2019, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ అప్లై ఆన్‌లైన్, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ గేట్ స్కోర్, డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్ రిక్రూట్‌మెంట్, డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్ మెకానికల్
Source: DRDO

DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF ఖాళీలు మొత్తం- 6
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 1


కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్- 1
మెకానికల్ ఇంజనీరింగ్- 1
Loading...
ఓషియనోగ్రఫీ- 1
ఫిజిక్స్- 1
అప్లైడ్ కెమిస్ట్రీ / పాలిమర్ కెమిస్ట్రీ- 1
దరఖాస్తుకు చివరి తేదీ- అక్టోబర్ 18
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ- అక్టోబర్ 20
విద్యార్హత- ఆయా విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌తో పాటు నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి.
వయస్సు- 28 ఏళ్ల లోపు
వేతనం- రూ.31,000+హౌజ్ రెంట్ అలవెన్స్
ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం:
Bhavan's Varuna Vidyalaya,
Naval Physical & Oceanographic Laboratory,
Thirikkakara P.O., Kochi 682021.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...