DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... డిప్లొమా, బీటెక్ పాసైతే చాలు

DRDO Apprenticeship 2019 | డీఆర్‌డీఓలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయకపోతే దరఖాస్తుల్ని అనుమతించరు.

news18-telugu
Updated: October 24, 2019, 10:21 AM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... డిప్లొమా, బీటెక్ పాసైతే చాలు
DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... డిప్లొమా, బీటెక్ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక రక్షణ శాఖ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తోంది. ఒడిషాలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-ITR కోసం గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 116 ఖాళీలను ప్రకటించింది డీఆర్‌డీఓ. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ https://rac.gov.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-ITR కేంద్రంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 1న ప్రారంభం కానుంది. దరఖాస్తు లింక్ అదే రోజున యాక్టివేట్ అవుతుంది. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ. డీఆర్‌డీఓలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయకపోతే దరఖాస్తుల్ని అనుమతించరు. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO Apprenticeship 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 116

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 60
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / ఐటీ- 22
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 25


ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 5మెకానికల్ ఇంజనీరింగ్- 3
సివిల్ ఇంజనీరింగ్- 1
ఏరోస్పేస్ ఇంజనీరింగ్- 2
లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్- 2

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్- 56
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / ఐటీ- 23
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 23
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 5
మెకానికల్ ఇంజనీరింగ్- 3
సివిల్ ఇంజనీరింగ్- 2

DRDO Apprenticeship 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 20 సాయంత్రం 05:30 గంటలు
విద్యార్హత- 2017, 2018, 2019 సంవత్సరాల్లో బీఈ / బీటెక్ / డిప్లొమా పాసైనవారి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. అంతకన్నా ముందు పాసైనవాళ్లు అర్హులు కాదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు కూడా అర్హులు కాదు.
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీకి రూ.9000, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ ట్రైనీకి రూ.8000.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే

EESL Jobs: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌లో 235 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత
First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>