DRDO Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... వివరాలివే

DRDO Scholarship 2019 for Girls | స్కాలర్‌షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 16, 2019, 5:28 PM IST
DRDO Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీఆర్‌డీఓ సహకారంతో ఏరోనాటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (AR&DB) ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది. మొత్తం 30 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2019 జూలై 25న ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 10న ముగుస్తుంది. https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తగిన అర్హతలు ఉన్న అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ఇచ్చే విషయంలో డీఆర్‌డీఓ కొన్ని నియమనిబంధనల్ని విధించింది. ఆ నిబంధనలేంటో తెలుసుకోండి.

Defence Research and Development Organisation Scholarship, DRDO Scholarship, DRDO Scholarship for girls, drdo scholarship 2019, drdo scholarship for engineering students, scholarship for girls 2019, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ స్కాలర్‌షిప్, డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్, అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్, డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ 2019
image: DRDO


DRDO Scholarship 2019 for Girls: ఎవరు దరఖాస్తు చేయొచ్చు?


కేవలం భారతీయులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఏటా రూ.1,20,000 లేదా వార్షిక ఫీజును స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్‌డీఓ. నాలుగేళ్ల వరకు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరి. నెలకు రూ.15,500 చొప్పున ఏటా రూ.1,86,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్లు ఇస్తారు. స్కాలర్‌షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 752 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ప్రసార భారతిలో 60 మార్కెటింగ్ జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా

BOB Jobs: బీటెక్ పాసయ్యారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
First published: July 16, 2019, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading