DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు

DRDO Recruitment 2019 | దరఖాస్తుల్ని సెప్టెంబర్ మూడోవారంలోగా స్పీడ్ పోస్ట్‌లో పంపాలి. ఎంపికైనవారికి రూ.31,000 స్టైపెండ్‌తో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ కూడా లభిస్తుంది.

news18-telugu
Updated: August 31, 2019, 4:00 PM IST
DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు (Image: DRDO website)
news18-telugu
Updated: August 31, 2019, 4:00 PM IST
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఇంజనీర్ల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ ఎయిర్‌బార్న్ సిస్టమ్స్-CABS సంస్థలో 20 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్-JRF పోస్టులున్నాయి. ఇవి రెండేళ్ల పోస్టులు మాత్రమే. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశముంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుల్ని సెప్టెంబర్ మూడోవారంలోగా స్పీడ్ పోస్ట్‌లో కింద వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఎంపికైనవారికి రూ.31,000 స్టైపెండ్‌తో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ కూడా లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసిన నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 20

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 7
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 8
మెకానికల్ ఇంజనీరింగ్- 2


ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 3
Loading...
విద్యార్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావడంతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరి.
వయస్సు: 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయస్సులో సడలింపు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Director,
Centre for Airborne Systems (CABS),
DRDO, Ministry of Defence,
Belur, Yemlur PO,
Bengaluru 560037.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే

Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...