news18-telugu
Updated: October 4, 2019, 11:37 AM IST
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)
భారత ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO వేర్వేరు యూనిట్లలో ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తోంది. ఈసారి డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్-DIBER కోసం మరో నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 15 ఖాళీలున్నాయి. అందులో 13 జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టులు కాగా, 2 రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టులు. జేఆర్ఎఫ్కు రూ.31,000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.54,000 వేతనం లభిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్డీ హోల్డర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పూర్తి బయోడేటాను పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 15
జూనియర్ రీసెర్చ్ ఫెలో (అగ్రికల్చరల్ సైన్స్)- 3
జూనియర్ రీసెర్చ్ ఫెలో (మైక్రో బయాలజీ)- 3
జూనియర్ రీసెర్చ్ ఫెలో (బయో టెక్నాలజీ)- 2
జూనియర్ రీసెర్చ్ ఫెలో (బాటనీ)- 2జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ)- 3
రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ)- 1
రీసెర్చ్ అసోసియేట్ (రెన్యువబుల్ ఎనర్జీ)- 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 15
వయస్సు- జేఆర్ఎఫ్ అభ్యర్థులకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్ అభ్యర్థులకు 35 ఏళ్లు.
విద్యార్హత- జేఆర్ఎఫ్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ క్వాలిఫై కావాలి. రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉండాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Director,
Defence Institute of Bio Energy Research (DIBER),
Goraparao, PO Arjunpur,
Haldwani 263139 (Uttarakhand).
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi 8A: నాచ్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో రెడ్మీ 8ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు... వివరాలివే
RRB NTPC: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? పరీక్ష ఆలస్యానికి కారణాలివే...
Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Published by:
Santhosh Kumar S
First published:
October 4, 2019, 11:37 AM IST