DRDO Jobs: డీఆర్‌డీఓలో 371 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత

DRDO recruitment 2019 | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో 371 ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: October 15, 2019, 11:18 AM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో 371 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత
DRDO Jobs: డీఆర్‌డీఓలో 371 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత
  • Share this:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ సంస్థకు చెందిన పరిశోధన కేంద్రాలున్నాయి. అనుబంధ సంస్థలున్నాయి. ఆయా విభాగాల్లో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. ఆ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటి వివరాలు చూస్తే... డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM అడ్మిన్ అండ్ అల్లైడ్ కేడర్‌లో స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 224 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక డిప్లొమా, బీటెక్, బీఈ అర్హతతో మరో 116 అప్రెంటీస్ ఖాళీలను ప్రకటించింది డీఆర్‌డీఓ. చండీపూర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ప్రముఖ ల్యాబరేటరీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-ITR కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 1న ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్-DIBER కోసం 15 ఖాళీలను భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. అందులో 13 జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టులు కాగా, 2 రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టులు. దరఖాస్తుకు 2020 జనవరి 15 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. వేర్వేరు విభాగాల్లో మొత్తం 6 ఖాళీలున్నాయి. బయోడేటాను అక్టోబర్ 18 లోగా mohiths@npol.drdo.in ఇ మెయిల్ ఐడీకి దరఖాస్తు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-ADE సంస్థ కోసం 10 పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. వీటికి బెంగళూరులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ rac.gov.in లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే

Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్... వివరాలివే
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు