హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Agnipath Recruitment Rally: ఏపీలోని నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఏపీలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే?

Agnipath Recruitment Rally: ఏపీలోని నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఏపీలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత కోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో (Agnipath Scheme) చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలని భావిస్తున్న యువతకు శుభవార్త. ఏపీలోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత కోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని (Agnipath Recruitment Rally) విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళలం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం విశాఖపట్నంలో ఎంపికను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరులకు సంబంధించిన సెలక్షన్ ను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ (Defence Ministry) తెలిపింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీలోగా రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామన్నారు. అభ్యర్థులు ఇంకా ఏమైనా సందేహాలుంటే.. 0891-2756959, 0891-2754680 నంబర్లను సంప్రదించాలని సూచించారు రక్షణ శాఖ అధికారులు.

Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?

ఇదిలా ఉంటే.. సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ను (Agnipath) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీ (Indian Navy) అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ (Registration)ను జూలై 1న ప్రారంభించింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోర్టల్‌ను ఓపెన్ కొద్ది రోజుల్లోనే దాదాపు 10,000 మంది మహిళలు ఈ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం.. భారత నౌకాదళం అగ్నిపథ్ (Agnipath) రిక్రూట్‌మెంట్ పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 1న ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ల తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జులై 15 నుంచి జులై 30 వరకు కొనసాగనుంది.

నావికా దళం సెయిలర్ పోస్టులకు మహిళలను రిక్రూట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ అవసరాలకు అనుగుణంగా యుద్ధనౌకలపై మోహరించే ఫోర్స్‌లో సెయిలర్స్‌గా మహిళలను నియమించుకోవడానికి ఇండియన్ నేవీ ఇటీవల అనుమతించింది. అయితే 2022లో ప్రవేశపెట్టనున్న 3000 నేవీ 'అగ్నివీర్స్'లో మహిళల సంఖ్యను నేవీ ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం వరకు దాదాపు 10,000 మంది మహిళా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం రిక్రూట్ చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు ANI వార్తా సంస్థకు తెలిపారు.

First published:

Tags: Agnipath Scheme, Central Government Jobs, Defence Ministry, JOBS

ఉత్తమ కథలు