DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఈ 1074 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఈ 1074 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

DFCCIL Recruitment 2021 | డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-DFCCIL భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-DFCCIL ఇటీవల 1074 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెరిగింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దరఖాస్తు చేయలేనివారికి మరో అవకాశం ఇచ్చింది DFCCIL. దరఖాస్తు గడువును 2021 జూలై 23 వరకు పొడిగించింది. విద్యార్హతల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,074 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఆపరేషన్స్ అండ్ బీడీ, మెకానికల్ డిపార్ట్‌మెంట్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://dfccil.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    DFCCIL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    జూనియర్ మేనేజర్ (సివిల్)- 31
    జూనియర్ మేనేజర్ (ఆపరేషన్స్ అండ్ బీడీ)- 77
    జూనియర్ మేనేజర్ (మెకానికల్)- 3
    ఎగ్జిక్యూటీవ్ (సివిల్)- 73
    ఎగ్జిక్యూటీవ్ (ఎలక్ట్రికల్)- 42
    ఎగ్జిక్యూటీవ్ (సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్)- 87
    ఎగ్జిక్యూటీవ్ (ఆపరేషన్స్ అండ్ బీడీ)- 237
    ఎగ్జిక్యూటీవ్ (మెకానికల్)- 3
    జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎలక్ట్రికల్)- 135
    జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్)- 147
    జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఆపరేషన్స్ అండ్ బీడీ)- 225
    జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (మెకానికల్)- 14

    Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం... 12 మందికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్

    Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

    DFCCIL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 23 రాత్రి 11.45 గంటలు
    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2021 సెప్టెంబర్ లేదా అక్టోబర్
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

    DFCCIL Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే


    అభ్యర్థులు ముందుగా https://dfccil.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    అందులో కెరీర్స్ సెక్షన్‌లో నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
    నోటిఫికేషన్‌లో Click Here to Apply Online లింక్ ఉంటుంది క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి స్టెప్ 1 లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    స్టెప్ 2 లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: