JEE, NEET Exams: జెఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్​పై కేంద్రం కసరత్తు..ఆగస్ట్​లోనే జరగనున్నాయా...

ప్రతీకాత్మక చిత్రం

‘‘జెఈఈ మెయిన్స్ పెండింగ్ దశ షెడ్యూల్​ను త్వరలోనే వెల్లడించాలని నిర్ణయించాం. ఆగస్టు 1న నీట్-యుజి పరీక్ష నిర్వహించవచ్చా? అనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. దీనిపై త్వరలోనే ఇస్తాం.’’ అని అన్నారు.

  • Share this:
కరోనా​ కారణంగా వాయిదా పడ్డ ఇంజనీరింగ్ ఎంట్రన్స్​ టెస్ట్​ జెఈఈ -మెయిన్స్, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజినీరింగ్​, మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏటా ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే, పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల మాదిరిగా వీటిని రద్దు చేయడం కుదరదు. అందువల్ల, ఈ ప్రవేశ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో, ఈ పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కసర్తతు చేస్తోంది. ఆగస్టు నెలలో వీటిని నిర్వహించనున్నట్లు ప్రాథమిక సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘‘జెఈఈ మెయిన్స్ పెండింగ్ దశ షెడ్యూల్​ను త్వరలోనే వెల్లడించాలని నిర్ణయించాం.

ఆగస్టు 1న నీట్-యుజి పరీక్ష నిర్వహించవచ్చా? అనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. దీనిపై త్వరలోనే ఇస్తాం.’’ అని అన్నారు. కాగా, జేఈఈ మెయిన్స్​ పరీక్షను ప్రతి ఏటా నాలుగు దశల్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో మొదటి దశ, మార్చిలో రెండవ దశ నిర్వహించారు. మూడు, నాలుగో దశలు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. అయితే, దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభనతో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫలితంగా, నీట్​తో పాటు జేఈఈ అడ్వాన్స్​ పరీక్ష కూడా వాయిదా పడింది.

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్​ ప్రకారం జేఈఈ అడ్వాన్స్​డ్​ ఎగ్జామ్​ జూలై 3న జరగాల్సి ఉంది. కానీ, కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఈ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో కొత్త షెడ్యూల్​ను​ విడుదల చేయాల్సి ఉంది.

త్వరలోనే షెడ్యూల్​ విడుదల..

నీట్-యూజి షెడ్యూల్​పై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోగా, మే 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఎగ్జామ్​ రిజిస్ట్రేషన్‌ను మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. నీట్​, జేఈఈ ఎగ్జామ్స్​తో పాటు సెంట్రల్ యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సియుసిఈటి) పరీక్షల నిర్వహణపై కూడా మంత్రిత్వ శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీటి షెడ్యూల్​ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా జూన్ 1న రద్దయిన 12 వ తరగతి పరీక్షల మార్కుల టేబులేషన్​ పాలసీని ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ). బోర్డు ఏర్పాటు చేసిన 13 మంది ప్యానెల్ సభ్యులు నిర్ణయించిన పాలసీ ప్రకారం,10 వ తరగతిలో వచ్చిన మార్కులకు 30 శాతం, 11వ తరగతిలో వచ్చిన మార్కులకు మరో 30 శాతం, 12 వ తరగతిలో నిర్వహించిన యూనిట్ టెస్ట్, మిడ్ టర్మ్, ప్రీ-బోర్డు టెస్ట్​లలో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇస్తారు. వీటిన్నింటిని కలుపుకొని మొత్తం మార్కులను లెక్కిస్తారు. ఈ రిజల్ట్స్​ కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.
Published by:Krishna Adithya
First published: