విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన ప్రణాళిక, క్రమశిక్షణ అవసరం. అవసరమైన పనులను వాయిదా వేస్తే చివరి నిమిషాల్లో ఒత్తిడి తప్పదు. గందరగోళానికి గురై పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఈ డిసెంబర్లో విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అకడమిక్ అంశాలు చాలా ఉన్నాయి. సీబీఎస్ఈ డేట్ షీట్ (CBSE Date Sheet), జేవియర్ అప్టిట్యూడ్ టెస్ట్ అడ్మిట్‌కార్డ్ రిలీజ్‌తో పాటు లా ఎంట్రన్స్ టెస్ట్, JNUEE వంటి కీలక పరీక్షలు ఈ నెలలో జరగనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
NEET SS ఛాయిస్- ఫిల్లింగ్
నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఛాయిస్‌లను ఫిల్ చేయడానికి నేడు చివరి తేదీ. అలాట్మెంట్ ప్రక్రియ డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. కోర్సుల్లో చేరిన విద్యార్థుల తుది జాబితాను డిసెంబర్ 10న MCC ప్రకటిస్తుంది. అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తమకు కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు డిసెంబర్ 11- 16 తేదీల మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2023 కోసం రిజిస్ట్రేషన్స్ డిసెంబర్ 11న ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్-2023 రెండు సెషన్స్‌లో జరగనుంది. సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్‌లో జరగనుంది. జేఈఈ రెండు షిప్ట్స్‌లో నిర్వహించనున్నారు. మార్నింగ్ షిప్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. తరువాతి షిప్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
CLAT- 2023
నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్టియం డిసెంబర్ 18న ఆఫ్‌లైన్ మోడ్‌లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)ను నిర్వహించనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ consortiumofnlus.ac.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని 22 నేషనల్ లా యూనివర్సిటీలు అందించే యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం క్లాట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.
సీబీఎస్ఈ డేట్ షీట్
పది, 12 తరగతుల బోర్డ్ పరీక్షల టైమ్ టేబుల్‌ను సీబీఎస్ఈ త్వరలో విడుదల చేయనుంది. విడుదలైన తరువాత cbse.gov.in- cbse.nic.inలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, 10, 12 తరగతుల ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (XAT)
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (XAT)- 2023 దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు తమ దరఖాస్తులను xatonline.in ద్వారా సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అభ్యర్థులు రూ. 2,000 దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. XAT 2023 హాల్ టిక్కెట్లు డిసెంబర్ 20న అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రవేశ పరీక్ష జనవరి 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల10 నిమిషాల వరకు జరగనుంది. ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పించడానికి జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తోంది.
JNUEE అడ్మిట్ కార్డ్
ఢిల్లీలోని జేఎన్‌యూలో ప్రవేశాల కోసం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JNUEE)ను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ పరీక్ష అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్సైట్ jnueexams.nta.ac.inలో అందుబాటులో ఉంది. కాగా, డిసెంబరు 7, 8, 9, 10 తేదీలలో దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను CBT మోడ్‌లో నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Exams, JOBS