DEAKIN UNIVERSITY KPMG LAUNCHES LEADERSHIP PROGRAMME FOR PROFESSIONALS GH VB
KPMG: ప్రొఫెషనల్స్ కోసం స్పెషల్ లీడర్షిప్ ప్రోగ్రామ్.. తాజాగా లాంచ్ చేసిన KPMG సర్వీసెస్.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
భవిష్యత్తులో ప్రపంచానికి నాయకత్వ లక్షణాలు ఉన్న ఉద్యోగులను అందించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ కొత్త కోర్సును ప్రారంభించింది. భారత దేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ కేపీఎమ్‌జీ తో కలిసి ఫ్యూచర్ లీడర్ ప్రోగ్రామ్ అనే ఒక వినూత్న ప్రోగ్రామ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
భవిష్యత్తులో ప్రపంచానికి నాయకత్వ లక్షణాలు ఉన్న ఉద్యోగులను అందించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ (Deakin university) కొత్త కోర్సును ప్రారంభించింది. భారత దేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ కేపీఎమ్‌జీ (KPMG)తో కలిసి ఫ్యూచర్ లీడర్ ప్రోగ్రామ్ (Future Leader Programme) అనే ఒక వినూత్న ప్రోగ్రామ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఇప్పటికే ఉద్యోగులుగా పలు సంస్థల్లో పని చేస్తున్న వారు... తమలోని నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకొని ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే వీలు కలుగుతుంది. ఈ ఫ్యూచర్ లీడర్ ప్రోగ్రామ్ (Future Leader Programme)కు ఎడ్ టెక్ కంపెనీ జారో ఎడ్యుకేషన్ (Jaro Education) పూర్తి సహాయ సహకారాలను అందించనుంది.
ఈ ప్రోగ్రామ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒక బిజినెస్‌కు సంబంధించి మంచి, చెడు సంఘటనలు జరిగినపుడు వాటిని స్వీకరించగల దృఢ మనస్థత్వాన్ని అలవరుచుకోవడం, తప్పు ఎక్కడ జరిగిందనే విషయాన్ని గ్రహించగలిగే క్రిటికల్ థింకింగ్ (Critical Thinking) వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. ఈ విషయాన్ని జారో ఎడ్యుకేషన్ (Jaro Education) ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యార్థులుగా చేరిన వారికి... భవిష్యత్తులో వచ్చే కొత్త బిజినెస్‌లను విజయవంతంగా ఏ విధంగా నడపాలో నేర్పిస్తారు.
ఫౌండర్లు ఎమన్నారంటే…
ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన సందర్భంగా జారో ఎడ్యుకేషన్ సీఈవో (CEO) రంజిత రామన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వృత్తుల్లో కొనసాగుతున్న వారిలో నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడం కోసం ఫ్యూచర్ లీడర్ ప్రొగ్రామ్ ఎంతగానో తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డీకిన్ యూనివర్సిటీ కేపీఎమ్జీలు భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టతతో కూడిన ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేలా ఫ్యూచర్ లీడర్ ప్రొగ్రామ్‌ను ఏర్పాటు చేశామని రంజిత స్పష్టం చేశారు.
అనంతరం డీకిన్ యూనివర్సిటీ సీఈవో గ్లెన్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ... ఫ్యూచర్లో ఎదరురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచానికి అత్యుత్తమ లీడర్లను తాము అందించనున్నామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు తన టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ కలిసి కట్టుగా ఆ సమస్యలను అధిగమించాలని ఆయన తెలియజేశారు. జారో ఎడ్యుకేషన్‌తో కలిసి ఫ్యూచర్ లీడర్ ప్రొగ్రామ్‌ను ఏర్పటు చేసినందుకు సంతోషంగా ఉందని కేపీఎమ్జీకి చెందిన విజయ్ గగోయ్ తెలిపారు. తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు ఇదొక చక్కటి అవకాశంగా ఆయన అభివర్ణించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.