DDA RECRUITMENT 2022 DELHI DEVELOPMENT AUTHORITY RELEASED JOB NOTIFICATION FOR CONSULTANT POSTS KNOW HOW TO APPLY SS
DDA Recruitment 2022: రూ.65,000 వరకు వేతనంతో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో జాబ్స్
DDA Recruitment 2022: పరీక్ష లేకుండా ఉద్యోగం... రూ.65,000 వరకు వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)
DDA Recruitment 2022 | ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి రూ.65,000 వరకు వేతనం లభిస్తుంది.
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్, సీనియర్ ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్ పోస్టుున్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. ఢిల్లీలో రీజనల్, సిటీ లెవెల్ ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
DDA Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు
5
విద్యార్హతలు
అనుభవం
వేతనం
కాంట్రాక్ట్ గడువు
కన్సల్టెంట్ (సీనియర్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్)
2
రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ఇన్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి. లేదా ఐదేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి.
కోర్ ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్ట్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
నెలకు రూ.65,000
ఒక ఏడాది
కన్సల్టెంట్ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్)
3
ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాస్ కావాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి.
ఆర్కిటెక్చరల్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఆటోక్యాడ్, అడోబ్ క్రియేటీవ్ సూట్, 3డీ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్ట్‌లో ఒక ఏడాది అనుభవం ఉండాలి.
అభ్యర్థులు మెయిల్ ద్వారానే దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది. చివరి తేదీ తర్వాత అంటే 2022 ఫిబ్రవరి 2 సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తుల్ని స్వీకరించరు. సూచించిన ఫార్మాట్లో కాకుండా ఇతర పద్ధతుల్లో పంపే దరఖాస్తుల్ని కూడా పరిగణలోకి తీసుకోరు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.