ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయనగరం జిల్లాలోని విజయనగరం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (Vijayanagaram District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ (Online)లోనే ఉంటుంది. రెగ్యులర్‌గా బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) చదివేవారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. బ్యాంక్ ప్రిపరేషన్ చేసే వారికి సేమ్ సెలబస్‌తో పరీక్ష ఉండనుంది. ఈ పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం (Application Process) కోసం అధికారిక వెబ్‌సైట్ https://dccbvizianagaram.com/careers/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | జీతం |
స్టాఫ్ అసిస్టెంట్ | 12 | అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, కామర్స్ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాాలి. | రూ.24,000 |
అసిస్టెంట్ మేనేజర్ | 12 | స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తో పాటు స్థానిక భాషలో ప్రొఫెషయన్సీ, కంప్యూటర నాలెడ్జ్ వచ్చి ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. | రూ.33,000 |
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న వారికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
- అందులో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
DCCB Recruitment 2021: నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000
పరీక్ష విధానం..
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
ఇంగ్లీష్ | 30 | 30 |
రీజనింగ్ | 35 | 35 |
క్వాంటేటీవ్ అప్టిట్యూడ్ | 35 | 35 |
- పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 60 నిమిషాల సమయంలో 100 ప్రశ్నలు చేయాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. పరీక్షలో నెగిటీవ్ మార్కింగ్ ఉంటుంది.
DCCB Recruitment 2021: కాకినాడ డీసీసీబీలో 60 ఉద్యోగాలు.. జీతం రూ.33,000.. అప్లికేషన్ ప్రాసెస్
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dccbvizianagaram.com/careers/ ను సందర్శించాలి.
DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో 67 ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం
Step 3 : పోస్టుల వారీగా నోటిఫికేషన్‌ను ఉంటుంది. వాటిని చదవాలి.
Step 4 : అనంతరం అర్హత ఉన్నవారు Click Here to apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 5 : క్లిక్ చేయగానే https://ibpsonline.ibps.in/dccbasmoct21/ లింక్ ఓపెన్ అవుతుంది.
Step 6 : అడిన సమాచారం అందించి, రిజస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Step 7 : అనంతరం జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.590 పరీక్ష ఫీజు చెల్లంచాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఈఎక్స్ఎస్ అభ్యర్థులు రూ.413 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 8 : దరఖాస్తుకు డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, Govt Jobs 2021, Job notification, JOBS