హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DCCB Recruitment 2021: ఐదు జిల్లాల్లో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌,

DCCB Recruitment 2021: ఐదు జిల్లాల్లో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌,

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

DCCB Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. విజ‌య‌న‌గ‌రం, తూర్పు గోదావ‌రి, గుంటూరు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. విజ‌య‌న‌గ‌రం, తూర్పు గోదావ‌రి, గుంటూరు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 24 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ (Online)లోనే ఉంటుంది. రెగ్యుల‌ర్‌గా బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) చ‌దివేవారికి ఇది మంచి అవ‌కాశంగా ఉంటుంది. బ్యాంక్ ప్రిప‌రేష‌న్ చేసే వారికి సేమ్ సెల‌బ‌స్‌తో ప‌రీక్ష ఉండ‌నుంది. ఈ పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం (Application Process) కోసం ఆయా బ్యాంక్‌ల‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

విజ‌య‌న‌గ‌రం డీసీసీబీలో..


జ‌య‌న‌గ‌రం జిల్లాలోని విజ‌య‌న‌గ‌రం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (Vijayanagaram District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 24 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.  (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

కాకినాడ‌ డీసీసీబీలో 60 ఉద్యోగాలు..


తూర్పు గోదావ‌రి జిల్లాలోని కాకినాడ‌ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (Kakinada District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 60 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

గుంటూరు డీసీసీబీలో 67 ఉద్యోగాలు..


గుంటూరు జిల్లాలోని గుంటూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (Guntur District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 67 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ (Online)లోనే ఉంటుంది.  (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

క‌డ‌ప‌ డీసీసీబీలో 75 ఉద్యోగాలు..


క‌డ‌ప‌ జిల్లాలోని క‌డ‌ప‌ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (kadapa District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్  విభాగాల్లో 75 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.  (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. 


నెల్లూరు జిల్లాలోని నెల్లూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (Nellore District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 65 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

ప‌రీక్ష విధానం..

విభాగంప్ర‌శ్న‌లుమార్కులు
ఇంగ్లీష్3030
రీజ‌నింగ్‌3535
క్వాంటేటీవ్ అప్టిట్యూడ్‌3535


- ప‌రీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు. 60 నిమిషాల స‌మ‌యంలో 100 ప్ర‌శ్న‌లు చేయాలి. మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారు. ప‌రీక్ష‌లో నెగిటీవ్ మార్కింగ్ ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, Bank Jobs, Bank Jobs 2021, Job notification, JOBS