Home /News /jobs /

DAYS AFTER NEET REMOVING BRA NOW REET 2022 CANDIDATES TOLD TO REMOVE DUPATTAS SARI PIN BANGLES KNOW FULL DETAILS VB

REET Test: నీట్ తరహాలో మరో ఘటన.. రీట్ పరీక్ష కేంద్రం వద్ద మహిళలకు అవమానం..

REET Test: నీట్ తరహాలో మరో ఘటన.. రీట్ పరీక్ష కేంద్రం వద్ద మహిళలకు అవమానం..

REET Test: నీట్ తరహాలో మరో ఘటన.. రీట్ పరీక్ష కేంద్రం వద్ద మహిళలకు అవమానం..

ఇటీవల నీట్‌ 2022 పరీక్షకు హాజరైన యువతుల లోదుస్తులను(బ్రా) విప్పించి విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవల నీట్‌ 2022 పరీక్షకు(NEET Exam) హాజరైన యువతుల లోదుస్తులను(బ్రా) విప్పించి విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. లో దుస్తులు విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేయడంతో.. కేరళలో(Kerala) మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు(Medical Entrance Exam) వచ్చిన ఆ యువతులు పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమి లేక విద్యార్థినులు అలానే చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు కారణం అయింది. ఈ ఘటనకు పాల్పడిన పలువురిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇలా సుమారు 100 మంది విద్యార్థినులు అవమానానికి గురయ్యారు.

Ather 450X Gen 3: కొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450X Gen 3 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146కి.మీ వెళ్లొచ్చు..


ఈ ఘటన మరువక ముందే రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ (REET) పరీక్షకు హాజరైన విద్యార్థుల విషయంలో కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఎలాంటి చీటింగ్‌ జరగకుండా ఉండేందుకు.. తనిఖీ చేస్తున్న సిబ్బంది మహిళా అభ్యర్థులను డ్రస్ పై వేసుకున్న దుపట్టాలను తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. సల్వార్ బటన్లు కత్తిరించారు. అంతే కాకుండా.. చీర పిన్ లను తొలగించమని హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



ఈ సంవత్సరం రీట్ కోసం.. రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచే విద్యార్థులు ఈ కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రం వెలుపల ఉంచిన జాబితాలోని వారి రోల్ నంబర్‌తో పాటు గది నంబర్‌ను సరి చూసుకున్నారు. ఉదయం నుంచి అన్ని కేంద్రాల వద్ద పోలీసు బృందాలను మోహరించారు. 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి విద్యార్థుల ప్రవేశం ప్రారంభం కాగా.. అంతకు ముందు విద్యార్థులు చెకింగ్ పరీక్షకు వెళ్లాల్సి వచ్చింది.

వారు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు.. విద్యార్థులను వ్యక్తిగతంగా తనిఖీ చేస్తున్న క్రమంలో బాలురు మరియు మహిళలలు క్యూలో నిల్చున్నారు. ఇలా నగరంలోని మోడ్రన్ స్కూల్, ఎంబీ స్కూల్, బీఈడీ కళాశాల, గురుకులం, మహారావల్ స్కూల్, కిషన్‌లాల్ గార్గ్ స్కూల్‌లో వివాహిత మహిళల మంగళసూత్రాలు, బ్యాంగిల్స్ మరియు హెయిర్ క్లిప్‌లను తీసివేయమని అడిగారు. అంతే కాకుండా..
తమ చెప్పులు మరియు బూట్లు కూడా తీసేయాలని కోరారు.

Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2022 హాజరయ్యే ముందు మహిళా వైద్య ఔత్సాహికులు తమ బ్రాలను తీసివేయమని అడిగిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది . దీనిపై  విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు జరకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   ఇక.. రీట్‌లో మొదటి రోజైన శనివారం మొదటి షిప్టులో మొత్తం 11 వేల 160 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, మధ్యాహ్నం రెండో షిప్టులో 9 వేల 216 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exams, JOBS, NEET, NEET 2022

తదుపరి వార్తలు