Home /News /jobs /

DATE AND SUBJECT WISE EXAM SCHEDULE FOR NTA UGC NET 2022 PHASE 1 UMG GH

UGC NET: యూజీసీ నెట్ ఫేజ్-1 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీల వివరాలివే

యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. అయితే గత ఏడాదిలో నిలిచిపోయిన డిసెంబర్ 2021 సెషన్‌, జూన్ 2022 సెషన్‌ను కలిపి ఒకే పరీక్షగా ఎన్‌టీఏ నిర్వహించనుంది. తాజాగా ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన ఫేజ్-1 ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. అయితే గత ఏడాదిలో నిలిచిపోయిన డిసెంబర్ 2021 సెషన్‌, జూన్ 2022 సెషన్‌ను కలిపి ఒకే పరీక్షగా ఎన్‌టీఏ నిర్వహించనుంది. తాజాగా ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన ఫేజ్-1 ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేసింది. యూజీసీ నెట్ 2022 ఎగ్జామ్‌ సబ్జెక్ట్ వారీ షెడ్యూల్‌ను అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ –ugcnet.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోచ్చు. షెడ్యూల్‌ ప్రకారం, ఈ పరీక్షలు ఈ ఏడాది జులై 9, 11, 12 & ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్నాయి.

ఎన్‌టీఏ విడుదల చేసిన సబ్జెక్ట్ వారీ షెడ్యూల్‌ ప్రకారం, యూజీసీ నెట్‌లో 26 సబ్జెక్టులకు మొదటి రోజు అంటే జులై 9న పరీక్ష జరుగుతుంది. జులై 11న 5 సబ్జెక్టులకు, జులై 12న 4 సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్‌ ఆగస్టు 12, 13, 14, 2022 తేదీలలో జరుగుతుంది. అయితే ఆగస్టు 12, 13 & 14 మధ్య నిర్వహించే సబ్జెక్టుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని యూజీసీ వెబ్‌సైట్‌ పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఏయే సబ్జెక్టుకు ఎప్పుడు పరీక్ష జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈ షెడ్యూల్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ చదవండి: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు


UGC NET 2022 ఫేజ్ 1 పరీక్ష టైమ్ టేబుల్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

1. అభ్యర్థులు మొదటగా NTA అఫీసియల్ వెబ్‌సైట్‌ –ugcnet.nta.nic.in ని విజిట్ చేయాలి.

2. హోమ్‌పేజీలో ‘ఎన్‌టీఏ యూజీసీ నెట్ 2022 ఫేజ్‌ 1 (NTA UGC NET 2022 Phase 1)’ అని ఫ్లాష్ అవుతున్న నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. లేదా పబ్లిక్ నోటీసు (Public Notice) సెక్షన్‌లో ఉన్న ఎన్‌టీఏ యూజీసీ నెట్ 2022 ఫేజ్‌ 1 షెడ్యూల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత పరీక్షల షెడ్యూల్ PDF డౌన్‌లోడ్ లేదా ఓపెన్ అవుతుంది.

4. ఆ PDF ఫైల్‌లో సబ్జెక్టు-వైజ్‌గా పరీక్ష తేదీలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు.

5. అభ్యర్థులు NTA UGC NET 2022 ఫేజ్ 1 పరీక్ష షెడ్యూల్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



అడ్వాన్స్‌డ్‌ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. UGC-NET డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్ష అభ్యర్థులు సిటీ సెంటర్ తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్, ఇతర వివరాలను ఉపయోగించి సెంటర్ సిటీ గురించి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ugcnet.nta.nicని విజిట్ చేయాలి.
Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, UGC, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు