హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Top 7 Job Skills: 2022 లో జాబ్ మార్కెట్‌లో ఈ 7 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్

Top 7 Job Skills: 2022 లో జాబ్ మార్కెట్‌లో ఈ 7 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్

Top 7 Job Skills: 2022 లో జాబ్ మార్కెట్‌లో ఈ 7 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్
(ప్రతీకాత్మక చిత్రం)

Top 7 Job Skills: 2022 లో జాబ్ మార్కెట్‌లో ఈ 7 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్ (ప్రతీకాత్మక చిత్రం)

Top 7 Job Skills | భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందడానికి కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునేవారికి అలర్ట్. 2022 లో ఏఏ స్కిల్స్‌కు డిమాండ్ ఉండబోతుందో తెలుసుకోండి.

ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేస్తున్నారా? కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా? ట్రెండ్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త కోర్సులు వస్తుంటాయి. ఈ ఏడాది జాబ్ మార్కెట్‌లో ఏఏ కోర్సులకు డిమాండ్ ఉంటాయో తెలుసా? ఈ వివరాలను వెల్లడిస్తూ అమెరికాకు చెందిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ కోర్స్ఎరా (Coursera) ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. లింక్డ్‌ఇన్ లాంటి మరికొన్ని సంస్థలు కూడా కొత్త స్కిల్స్‌ని గుర్తించాయి. మరి రాబోయే 5 ఏళ్లు ఏఏ స్కిల్స్‌కి డిమాండ్ ఉంటుంది? ఏ స్కిల్స్ నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు పొందొచ్చు? తెలుసుకోండి.

Full Stack Development: ఇండీడ్ బెస్ట్ జాబ్స్ ఆఫ్ 2020 జాబితాలో ఫుల్ స్టాక్ డెవలపర్ రెండో స్థానంలో ఉండటం విశేషం. 2022 లో కూడా ఈ స్కిల్స్‌కు డిమాండ్ కనిపించబోతోంది. ఐటీ రంగంలో చాలా విభాగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండటం, సాఫ్ట్‌వేర్, యాప్స్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో ఫుల్ స్టాక్ డెవలపర్లకు డిమాండ్ కొనసాగనుంది.

UPSC Recruitment 2022: మొత్తం 187 ఖాళీలతో యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... అప్లై చేయండి ఇలా

Data Science: ప్రతీ జాబ్ మార్కెట్‌లో కావాల్సిన స్కిల్స్‌లో డేటా అనాలిసిస్ ఒకటి. అన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు డేటా అనాలిసిస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ నుంచి అడ్వర్టైజింగ్ వరకు ప్రతీచోటా డేటా అనాలిసిస్ కీలకంగా మారుతోంది. తమ సంస్థల్ని ముందుకు తీసుకెళ్లడంలో డేటాను విశ్లేషణ కీలకంగా మారుతోంది.

Programming: జాబ్ మార్కెట్‌లో ప్రోగ్రామింగ్‌కు డిమాండ్ కొనసాగుతోంది. వెబ్‌సైట్స్, యాప్స్ రూపొందించడానికి ప్రోగ్రామింగ్ కీలకంగా మారుతోంది. జావా, జావాస్క్రిప్ట్, రూబీ, పైథాన్, సీ++ లాంటి టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నవారికి డిమాండ్ కొనసాగనుంది.

UX Design: ప్రస్తుతం అందరూ డిజిటల్ ప్రపంచంలోనే బతుకుతున్నారు. ప్రతీ వెబ్‌సైట్, యాప్ వినియోగం పెరిగింది. యూజర్లను మరింత ఆకట్టుకోవడానికి యూఎక్స్ డిజైన్ ముఖ్యమైపోయింది. యూజర్ల సైకాలజీ, సెంటిమెంట్, అవసరాలు దృష్టిలో పెట్టుకొని యూఎక్స్ డిజైన్ చేసేవారికి మంచి డిమాండ్ ఉంటుంది.

Head Constable Jobs 2022: పోలీస్ జాబ్ మీ కలా? 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Cloud Computing: ఈ ఏడాది క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించబోతోంది. ఈ రోజుల్లో ప్రతీ టెక్నాలజీలో క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ కీలకం అవుతోంది. కాబట్టి క్లౌడ్ డెవలపర్, ఆడిటర్, ఆర్కిటెక్ట్ లాంటివారికి మంచి ఉద్యోగాలు లభించబోతున్నాయి.

Blockchain: బ్లాక్‌చెయిన్ ప్రోగ్రామింగ్ గతేడాది ఎక్కువగా డిమాండ్ ఉన్న స్కిల్స్‌లో ఒకటని లింక్డ్‌ఇన్ సర్వే వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీ లాంటివాటిలో బ్లాక్‌చెయిన్ పాత్ర కీలకం. 2022 లో కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి డిమాండ్ కనిపించబోతోంది.

AR and VR: ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీని కలిపి ఎక్స్‌టెండెడ్ రియాల్టీ (XR) అని పిలుస్తున్నారు. ఈ ఏడాది మాత్రమే కాదు... రాబోయే ఏళ్లలో కూడా ఈ టెక్నాలజీ మరిన్ని రెట్లు పెరిగిపోనుంది. ఈ రంగాల్లో స్కిల్స్ ఉన్నవారికి కొన్నేళ్లపాటు డిమాండ్ కనిపిస్తుంది.

First published:

Tags: Artificial intelligence, CAREER, Career and Courses, JOBS, Online Education

ఉత్తమ కథలు