Home /News /jobs /

DATA SCIENCE TO ANALYTICS IIT MANDI OFFERS ONLINE COURSES IN EMERGING TECH AND ANYONE CAN APPLY GH VB

IIT Mandi: డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్‌లో ఆన్‌లైన్ కోర్సులు.. ఐఐటీ మండి అందిస్తున్న సరికొత్త ప్రోగ్రామ్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (MSDE) ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) వివిధ కొత్త టెక్నాలజీలపై కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది.

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్(Ministry Of Skill Development) & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (MSDE) ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) వివిధ కొత్త టెక్నాలజీలపై కొత్త కోర్సులను(New Course) ప్రవేశపెట్టనుంది. ఇందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండితో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. డేటా సైన్స్(Data Science), బిగ్ డేటా అనలిటిక్స్( big data analytics) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో డిజిటల్ కోర్సు(Digital Course)లను రూపొందించేలా చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని ఐఐటీ మండి తెలిపింది. ఐఐటీ మండితో పాటు NSDC కూడా విద్యార్థులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ప్రోగ్రామ్‌(Training Programme)కు రూపకల్పన చేయనున్నాయి. భారతీయ యువతలో ఎంటర్ ప్రెన్యూయల్ స్పిరిట్‌తో పాటు సంస్కృతిని పెంపొందించడం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటీ మండి తెలిపింది.

‘కటింగ్- ఎడ్జ్ లెర్నింగ్ అవకాశాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ట్రైనింగ్‌లో కొత్త రకం పద్దతులను సంయుక్తంగా రూపాందించాం. ఇది మెరుగైన ఉపాధికి దారి తీస్తుంది. మొత్తం శిక్షణా కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌డీసీ పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా మేం అందిస్తున్న శిక్షణా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులను కూడా సమీకరించనుంది.’ అని ఐఐటీ మండి వెల్లడించింది.

Explained: QUAD అంటే ఏంటి..? చైనా దూకుడును అడ్డుకోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమా..? 


ఐఐటీ మండితో వ్యూహాత్మక భాగస్వామ్యం‌పై NSDC చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. ‘సాంకేతికతతో నడిచే భవిష్యత్తు వైపు మనం దూసుకుపోతున్నాం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం అధిక-నాణ్యతతో, నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడానికి మనకు అపారమైన అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా సాంప్రదాయ ఉద్యోగ పాత్రల కోసం మెకానిజమ్‌లను బలోపేతం చేస్తూనే, కొత్తతరం నైపుణ్యాలను అభివృద్ధి చేయవలసిన అవసరం కూడా ఏర్పడింది. దేశంలోని యువత అందుబాటులో ఉన్న వనరులను యాక్సెస్ చేసుకొని సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ఓ సమగ్రమైన వ్యవస్థను రూపొందించడానికి విద్యా సంస్థలు, పరిశ్రమలు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో దేశ యువతను నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లడానికి IIT మండితో మా భాగస్వామ్యం కీలమైన అడుగు.’ అని చెప్పారు.

ఐఐటీ మండి డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా మాట్లాడుతూ... NSDC సహకారంతో నిరుపేద యువత, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు ఇతరులకు అత్యాధునిక నైపుణ్యాలను అందించడానికి IIT మండి దీర్ఘకాలిక ప్రయాణాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఐఐటీ మండి క్యాంపస్‌లో విద్యార్థుల ప్రయోగాత్మక ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఉమ్మడి చొరవ‌తో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇది ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో నైపుణ్యాలను ప్రోత్సహిస్తుందన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IIT

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు