హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Jobs: ఈ కోర్సులు చేశారా? ఐటీ కంపెనీల్లో వీరికి భలే డిమాండ్

IT Jobs: ఈ కోర్సులు చేశారా? ఐటీ కంపెనీల్లో వీరికి భలే డిమాండ్


5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లోని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్.. ప్రొఫెషనల్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఉత్పాదకతను (ప్రొడక్టివిటీ) పెంచుతుంది. వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంతిమంగా వృద్ధిని పెంచుతుంది.’ అని సౌరభ్ వివరించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లోని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్.. ప్రొఫెషనల్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఉత్పాదకతను (ప్రొడక్టివిటీ) పెంచుతుంది. వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంతిమంగా వృద్ధిని పెంచుతుంది.’ అని సౌరభ్ వివరించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

IT Jobs | మీరు ఐటీ ఉద్యోగం కోరుకుంటున్నారా? సాఫ్ట్‌వేర్ జాబ్ మీ కలా? కంపెనీలు ఎలాంటి స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నాయో తెలుసుకోండి.

కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. లాక్​డౌన్​లు ఎత్తేస్తుండడంతో అన్ని రంగాల కార్యాకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే చాలా రంగాల్లో పనితీరు మారడంతో ఐటీ అవసరాలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో టెక్ ఉద్యోగాలు వెల్లువలా రానున్నాయి. భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు, స్టార్టప్​లు అర్జెంట్‌గా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఐటీ సర్వీసులకు మరింత డిమాండ్ రావడంతో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. దేశంలోని కీలక ఐటీ కంపెనీల్లో వందలాది ఉద్యోగాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. టాలెంటెడ్ ఉద్యోగులు దొరికితే అత్యధిక ప్యాకేజీలు ఇచ్చేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

భారీ ఐటీ సంస్థలతో పాటు స్టార్టప్​లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో చాలా ఐటీ సంస్థలు, స్టార్టప్​లు 70,000 వేల మందిని నియమించుకునేందుకు సిద్ధమయ్యాయని స్పెషలైజ్డ్ స్టాఫింగ్ సంస్థ ఫెనో ఓ నివేదిక వెల్లడించింది. ఆరు రోల్స్​లోనే ఈ మొత్తం ఉద్యోగాలు ఉన్నాయని, 50 నుంచి 60 శాతం వేతనాల పెంచి అయినా ఉద్యోగులను చేర్చుకోవాలని సంస్థలు భావిస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఫుల్​ స్టాక్​ డెవలపర్​, డేటా ఇంజినీర్స్​, రియాక్ట్ నేటివ్ డెవలపర్స్​, డేవ్​ఆప్స్​, బ్యాక్​ఎండ్ ఇంజినీర్స్​, మెషిన్ లెర్నింగ్​లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రోల్స్​లో ఉండి మంచి అనుభవం ఉన్న వారికి వేతనాలు కూడా 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... డీఏ పెంచిన కేంద్రం... ఎంతంటే?

AP Jobs 2021: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 319 ఉద్యోగాలు... 3 రోజులే గడువు

మరోవైపు ఐటీలో టాలెంటెడ్ ఉద్యోగులకు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికీ పూర్తి అవసరాలకు సరిపడా ఎంప్లాయిస్ లేరని నిపుణులు చెబుతున్నారు. “ఆర్థిక రంగం తిరిగి పుంజుకోవడంలో టెక్నాలజీ ముందుంటుంది. కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. పని చేసే మార్గాలను మార్చుకోవాల్సిన సవాల్ ఎదురైంది. దీనివల్ల టెక్ టాలెంట్​కు డిమాండ్ చాలా పెరిగిపోయింది” అని వార్షిక రిపోర్టులో విప్రో ఛైర్మన్​ రిషాద్ ప్రేమ్​జీ ప్రస్తావించారు. మరోవైపు అవసరమైన ఉద్యోగులు లేక కొన్ని ప్రాజెక్టులను కోల్పోతున్నామని ఇటీవల కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్​షైర్స్ కూడా అన్నారు.

SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్‌బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా

IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు వెళ్లిపోకుండా ఐటీ సంస్థలు భారీగానే వేతనాలు పెంచుతున్నాయి. టాలెంట్ ఉన్న ఎంప్లాయిస్​కు భారీ హైక్స్ ఇస్తున్నాయి. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, విప్రో ఇప్పటికే ఉద్యోగులకు రెండో సారి వేతనాలు పెంచుతామని ప్రకటించాయి. టీసీఎస్ తమ ఉద్యోగులకు గత సంవత్సరం 2020లోనే ఇంక్రిమెంట్స్ ఇవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్​లో మరోసారి ప్రకటించింది. ఇన్ఫోసిస్​, విప్రో, అసెంచర్​ లాంటి భారీ ఐటీ కంపెనీలు కూడా ఏడాది వ్యవధిలో ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచాయి.

First published:

Tags: CAREER, Exams, Google, Infosys, Job notification, JOBS, NOTIFICATION, TCS, Upcoming jobs

ఉత్తమ కథలు