దేశంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై కీలక సర్వే చేపట్టింది క్యూస్ క్రాప్(Quess Corp) సంస్థ. జాబ్ మార్కెట్లో ఎలాంటి స్కిల్స్‌కు డిమాండ్ ఉందనే వివరాలను సర్వే వెల్లడించింది. డేటా అనలిటిక్స్, జావా టెక్రాలజీస్, క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్, యూఐ అండ్ యూఎక్స్ (UI & UX) వంటి రంగాల్లో అత్యుత్తమ డిజిటల్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ బాగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. ప్రధానంగా ఈ ఐదు పరిశ్రమలలో వీటికి డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. ప్రాడక్ట్స్ (22 శాతం), ఆటోమోటివ్ అండ్ ఇంజనీరింగ్ (11 శాతం), బీఎఫ్ఎస్‌ఐ (11శాతం), టెలికాం (11శాతం), కన్సల్టింగ్ (9 శాతం) సెక్టార్లలో డిజిటల్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ ఉన్నట్లు తెలిపింది.
డేటా అనలిటిక్స్‌కు బెంగుళూరు (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) అత్యధిక డిమాండ్ ఉంది. అయితే జావా టెక్నాలజీస్‌కు పూణే (40 శాతం), బెంగళూరు (25 శాతం)లో అత్యధిక డిమాండ్ ఉంది. బెంగళూరు (60 శాతం), చెన్నై (15 శాతం)లో క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీస్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. బెంగళూరు 72 శాతం, పూణే 14 శాతం డిమాండ్‌తో తరువాతి స్థానంలో పుల్ స్టాక్ టెక్నాలజీ నిలిచింది. ఇక చివరగా UI & UX కు పూణేలో 52 శాతం, బెంగళూరులో 24 శాతం డిమాండ్ ఉంది.
క్యూస్ (Quess) ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ మాట్లాడుతూ..“టెక్ హైరింగ్ మార్కెట్‌లో ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ, ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్‌లో స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. సంస్థలు డిజిటల్ అండ్ క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో కొనసాగుతున్నాయి. ఉద్యోగాల్లో కూడా అదేస్థాయి పెరుగుదల కనిపిస్తుంది. అయితే స్టార్టప్‌లో మాత్రం నియామకాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టెక్ & ఆర్&డీలో దేశం వృద్ధిని కొనసాగిస్తోంది’’ అని తెలిపారు.
క్యూస్ నివేదిక ప్రకారం.. అత్యుత్తమ డిజిటల్ స్కిల్స్ కోసం నియామక ప్రక్రియలో దేశంలోని ఐటీ మెట్రో హబ్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ (34 శాతం), బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. “ప్రస్తుతం కంపెనీలు తమ ఉనికిని మెట్రోలకు మించి విస్తరించడంతో, ఎన్‌సిఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలు కూడా డిజిటల్ నైపుణ్యాలకు పెరిగిన డిమాండ్‌ను గుర్తించాయి” అని సర్వే పేర్కొంది.
“ఈ రోజు చాలా కంపెనీలు తమ వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి, మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు అత్యాధునిక డిజిటల్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయి. వర్చువలైజేషన్, కనెక్టివిటీని స్వీకరించడం, క్లీన్ టెక్నాలజీస్ వంటివి దేశంలో డిజిటల్ పరిశ్రమ గమనాన్ని మార్చాయి.” అని క్యూస్ క్రాప్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Data science, JOBS