హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఐఐటీ మద్రాస్ కార్బన్ జీరో ఛాలెంజ్ ప్రోగ్రామ్‌ ప్రారంభం.. విజేతలకు రూ.10 లక్షలు..

IIT Madras: ఐఐటీ మద్రాస్ కార్బన్ జీరో ఛాలెంజ్ ప్రోగ్రామ్‌ ప్రారంభం.. విజేతలకు రూ.10 లక్షలు..

IIT Madras

IIT Madras

IIT Madras: షార్ట్‌లిస్ట్ చేసిన బృందాలు స్టార్టప్‌లను స్థాపించడానికి, వాణిజ్యీకరణ ద్వారా తమ ఆలోచనను మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి నిధులు, మెంటర్‌షిప్ పొందుతాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) కార్బన్ జీరో ఛాలెంజ్(CZC) తదుపరి ఎడిషన్‌ను ప్రారంభించింది. వాతావరణ మార్పులు, కాలుష్యం (Pollution), జీవవైవిద్య నష్టం వంటి సంక్షోభాల కారణంగా పెరుగుతున్న 'వనరుల క్షీణత, కాలుష్యం'పై ఈ ప్రోగ్రామ్ దృష్టి సారిస్తోంది. CZC 2022, ఆల్-ఇండియా ఎకో-ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్‌ ల్యాబ్-టు-మార్కెట్ పరివర్తనను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్, ల్యాబ్-స్కేల్ సొల్యూషన్‌ల నుంచి వర్కింగ్ ప్రోటోటైప్‌లు లేదా పైలట్‌ల వరకు ఆవిష్కరణలకు నిధులు సమకూర్చడం ద్వారా లక్ష్యాలను చేరుకోనుంది.


* విజేతలకు రూ.10 లక్షలు
షార్ట్‌లిస్ట్ చేసిన బృందాలు స్టార్టప్‌లను స్థాపించడానికి, వాణిజ్యీకరణ ద్వారా తమ ఆలోచనను మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి నిధులు, మెంటర్‌షిప్ పొందుతాయి. అదనంగా CZC 2022 విజేతలు ప్రారంభ సీడ్ గ్రాంట్‌గా రూ.10 లక్షలు పొందుతారు. IIT మద్రాస్ నుంచి IITM ఇంక్యుబేషన్ వనరులు, ఏంజెల్, VC నిధుల యాక్సెస్ వంటి సపోర్ట్‌ కూడా లభిస్తుంది.* వాహనాలతోనే అధిక కాలుష్యం

ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ADB) నివేదికల ప్రకారం.. ఆసియాలోని నగరాల్లో 80 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం కారణంగా కలుగుతోంది. 2035 నాటికి ఆసియా 1 బిలియన్ కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటుంది. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. పర్యావరణ క్షీణత వల్ల భారతదేశానికి ఏటా 80 బిలియన్ యూఎస్‌ డాలర్లు నష్టం వాటిల్లుతోంది.


CZC ప్రిన్సిపల్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ ఇందుమతి ఎం.నంబి, ఇతర ప్రముఖుల సమక్షంలో క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో IIT మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, కార్బన్ జీరో ఛాలెంజ్(CZC) మూడో ఎడిషన్‌ను ఆగస్టు 24న ప్రారంభించారు. దరఖాస్తు చేయడానికి 2022 సెప్టెంబర్ 24 చివరి తేదీ. పోటీ, దరఖాస్తు ప్రక్రియ వివరాలను CZC2022 వెబ్ పోర్టల్ నుంచి పొందవచ్చు.


* స్యూల్‌ ఆఫ్‌ సస్టైనబిలిటీ ప్రారంభం

లాంచ్ ఈవెంట్‌ను ఉద్దేశించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడుతూ..‘CZCలు, గత రిసెర్చ్ ఎడిషన్స్ నుంచి పొందిన అనుభవాల ఆధారంగా, ఐఐటీ మద్రాస్, యూఎన్‌ సస్టైనబుల్ కోసం పని చేసే 'స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ'ని స్థాపించబోతోంది. CZC 2022 ఈ రంగంలో సవాళ్లు, సాంకేతిక అవసరాలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. మా పరిశోధన, కోర్సు పాఠ్యాంశాలు, ఇతర కార్యకలాపాలు యూఎన్‌ సస్టైనబుల్‌ లక్ష్యాలను చేరుకోవడంలో సమస్యలను పరిష్కరించడం, ఈ రాబోయే స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి.’ అని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : డిస్టెన్స్, ఆన్‌లైన్ మోడ్ కోర్సుల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు.. యూజీసీ రూల్స్ ఇవే..


థేల్స్, CZC 2022, ఇతర మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఆలోచనను వర్కింగ్ ప్రోటోటైప్‌గా మార్చడానికి, ప్రీఇన్‌క్యుబేషన్, ఇంక్యుబేషన్ ద్వారా సపోర్ట్ టీమ్‌లకు సీడ్ ఫండింగ్ ముఖ్యమన్నారు. CZC మునుపటి ఎడిషన్‌లలో మద్దతు పొందిన HomoSEP, ఒక ప్రొడక్ట్‌గా మారిందని, థర్డ్‌ డివైజ్‌ ఇటీవల మాన్యువల్ స్కావెంజింగ్‌లో నిమగ్నమై ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యునికి అందించారని చెప్పారు.


IIT మద్రాస్ ఈ పోటీలో పాల్గొనే వారి ఆవిష్కరణలకు పేటెంట్ పొందేందుకు సహకారం లభిస్తుందని, ఇన్‌స్టిట్యూట్ బలమైన ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని పేర్కొన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి, వారి ఆలోచనలను ఆచరణీయమైన వ్యాపారంగా మార్చడానికి సాయం చేస్తుందని తెలిపారు.


CZC 2022 థీమ్‌ను 'CRC' ఫర్‌ CZC (లేదా) 'సర్క్యులారిటీ ఇన్‌ రిసోర్స్‌ కన్వర్జేషన్‌గా పేర్కొన్నారు. వనరుల సంరక్షణ, రీథింకింగ్‌ డిజైన్‌, మెటీరియల్స్‌ టూ ఎనేబుల్‌ రిడక్షన్‌, రీసైక్లింగ్, రికవరీ, రీయూజ్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, భూమి సరఫరాను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేయడం లక్ష్యంగా థీమ్‌ను సెలక్ట్‌ చేశారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS

ఉత్తమ కథలు