CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...

CWC Recruitment 2019 : పోటీ ప్రపంచంలో ప్రతి ఉద్యోగమూ ముఖ్యమైనదే. ప్రతీ జాబ్‌కీ పోటీ పడాల్సిందే.

Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 3:02 AM IST
CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 3:02 AM IST
CWC Job Notification : కేంద్ర గిడ్డంగుల సంస్థ ( Central Warehousing Corporation (CWC)) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్స్, ట్రాన్స్‌లేటర్ తదితర ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలని కోరింది. మొత్తం 571 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ వంటి పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15న అప్లికేషిన్ ప్రాసెస్ మొదలవుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద ఉంది. అప్లికేషన్లు పంపాల్సిన చివరి తేదీ మార్చి 16. అంటే రెండు రోజుల్లోనే ప్రాసెస్ ముగుస్తుంది.

తగిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు... జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ తదితర పోస్టులకు ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల పరిశీలన కూడా ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

ఎలా అప్లై చేసుకోవాలి : అభ్యర్థులు... www.cewacor.nic.in లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ PDF ఫార్మాట్‌లో కూడా లభిస్తోంది. అందుకోసం ఈ లింక్‌ క్లిక్ చెయ్యండి. https://testchampion.jagranjosh.com/free-pdf-page?file=cwc-recruitment-for-571-accountants--translator---other.pdf

ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ - http://cewacor.nic.in/index.php



 

ఇవి కూడా చదవండి :

ఆ గ్రహశకలంపై 20,00,000 కేజీల బంగారం ఉందన్న నాసా... ఫ్యూచర్‌లో తవ్వేస్తారా....
Loading...
అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...

ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి
First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...