హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Results Released: విద్యార్థులకు అలర్ట్ .. ఆ పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Exam Results Released: విద్యార్థులకు అలర్ట్ .. ఆ పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Exam Results Released: విద్యార్థులకు అలర్ట్ .. ఆ పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Exam Results Released: విద్యార్థులకు అలర్ట్ .. ఆ పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక సైట్ cuet.nta.nic.inని సందర్శించడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక సైట్ cuet.nta.nic.inని సందర్శించడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు. విద్యార్థులు ఫలితాలను చూసుకునే సమయంలో అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది. NTA CUET PG ఫలితాలను విడుదల చేయడానికి ముందు, పరీక్ష యొక్క తుది సమాధాన కీ విడుదల చేయబడింది. CUET PG 2022 పరీక్ష సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 12 వరకు నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష రెండు షిఫ్టులలో (02 సెషన్స్) నిర్వహించబడింది.

మొదటి షిప్టు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. CUET PG పరీక్ష మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (MCQ) ఫార్మాట్‌లో నిర్వహించబడింది. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందుతారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

- ఫలితాన్ని చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా CUET PG అధికారిక సైట్‌ని cuet.nta.nic.inని సందర్శించండి .

-దీని తర్వాత, అభ్యర్థులు హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న CUET PG ఫలితం 2022 లింక్‌పై క్లిక్ చేయండి.

-ఇప్పుడు అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి.

-అప్పుడు అభ్యర్థి యొక్క ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

-అభ్యర్థులు ఫలితాలకు సంబంధించి వివరాలను సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

NTA తన అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 26 సాయంత్రం సయంలో CUET PG పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 3,34,997 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మొత్తం 11 దశల్లో ఈ పరీక్ష నిర్వహించారు. కామన్ యూనివర్శిటీ టెస్ట్ PG (CUET PG) దేశంలోని 500 నగరాల్లో నిర్వహించబడింది. అయితే ఈ పరీక్ష దేశం వెలుపల 13 నగరాల్లో నిర్వహించబడింది. NTA సెప్టెంబరు 24న పరీక్ష యొక్క తుది సమాధాన కీలను విడుదల చేసింది. సీయూఈటీ పీజీలో ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి అభ్యర్థికి 4 మార్కులు లభిస్తాయి. తప్పు సమాధానానికి మైనస్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి.. అభ్యర్థికి 1 మార్కు తీసివేయబడుతుంది.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

CUET PGలో విజయవంతమైన అభ్యర్థులు విశ్వవిద్యాలయం యొక్క వెబ్‌సైట్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్, దరఖాస్తు ఫారమ్ మరియు ర్యాంక్ కార్డ్ లేదా మార్క్ షీట్ వంటి CUETకి సంబంధించిన డాక్యుమెంట్‌లను తమ వద్ద సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ పత్రాలు అడ్మిషన్ తర్వాత ఉంటే దశలకు ఉపయోగపడుతుంది.

6 మంది విద్యార్థులు 100 శాతం మార్కులు సాధించారు..

ఈ పరీక్షలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు 100 శాతం మార్కులు సాధించారు. వీరిలో నకుల్ కుమార్, ఆకాష్ పటేల్, సుమిత్ జోషి, నీరజ్ గోదారా, మయాంక్ కుమార్ మిశ్రా మరియు మోహిత్ ఉన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Cucet, CUCET 2022, Cuet, CUET 2022, JOBS

ఉత్తమ కథలు