Home /News /jobs /

CURRENCY NOTE PRESS RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 149 JR TECHNICIAN AND OTHER POSTS NS

Currency Note Press Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

జూనియర్ టెక్నీషియన్ తో పాటు పలు ఖాళీల భర్తీకి కరెన్సీ నోట్ ప్రెస్ (Currency Note Press) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    కరెన్సీ నోట్ ప్రెస్ (Currency Note Press), మహారాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ టెక్నీషియన్ తో పాటు పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 149 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు cnpnashik.spmcil.com వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.

    ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..








































    పోస్టుఖాళీలు
    వెల్ఫేర్ ఆఫీసర్1 పోస్టు
    సూపర్ వైజర్ (టెక్నికల్ కంట్రోల్)10 పోస్టులు
    సూపర్ వైజర్ (టెక్నికల్ ఆపరేషన్-ప్రింటింగ్)5 పోస్టులు
    సూపర్ వైజర్(అఫీషియల్ లాంగ్వేజ్)1 పోస్టు
    సెక్రటేరియల్ అసిస్టెంట్1 పోస్ట్
    జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్6 పోస్టులు
    జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్)104 పోస్టులు
    జూనియర్ టెక్నీషన్(వర్క్ షాప్)21 పోస్టులు

    Job Mela in AP: ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

    విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఐటీఐ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
    వయో పరిమితి: 18 నుంచి 30 ఏళ్ల వయోపరిమితి ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    Army Public School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే:
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://cnpnashik.spmcil.com/) ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: పైన పేర్కొన్న ఖాళీలకు అప్లై చేయడానికి ( Click Here to Apply Online) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Step 4: అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం Click here for New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


    Step 5: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 6: రిజిస్ట్రేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
    Step 7: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు