హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET 2023: సీయూఈటీ అభ్యర్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్

CUET 2023: సీయూఈటీ అభ్యర్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీయూఈటీ-2023 కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, రేపటి(మార్చి30)తో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు గడువును ఒకసారి పొడిగించారు. దీంతో మరోసారి పొడిగింపుకు అవకాశం ఉండకపోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

CUET 2023: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్‌లను(Entrance tests) నిర్వహించేవి. అయితే గతేడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీయూఈటీ-2023(CUET 2023)దీని కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, రేపటి(మార్చి30)తో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు గడువును ఒకసారి పొడిగించారు. దీంతో మరోసారి పొడిగింపుకు అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక పోర్టల్ cuet.samarth.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. సీయూఈటీ అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలను పరిశీలిద్దాం.

* అర్హత ప్రమాణాలు

ఇంటర్ ఉత్తీర్ణులైన వారు సీయూఈటీ-2023 కోసం అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్‌కు సమానమైన కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఇంటర్ ఫైనలియర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన లేదు. కానీ ప్రవేశం పొందాలనుకునే యూనివర్సిటీ నిబంధనలను తప్పక పుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది.

* రిజిస్ట్రేషన్ ప్రాసెస్

- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న లాగిన్ ఆప్షన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రీ లాగిన్ అయి అప్లికేషన్ ఫిల్ చేయాలి.

- అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. చివరగా కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోండి.

Hiring Intent: ఐటీ, ఏఐ, ఫిన్‌టెక్ స్టార్టప్స్‌లో భారీ ఉద్యోగాలు .. స్టార్టప్‌ల హైరింగ్ ట్రెండ్స్‌పై సర్వే..

* ఏప్రిల్ 1న కరెక్షన్ విండో ఓపెన్

సీయూఈటీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తరువాత ఏప్రిల్ 1 నుంచి కరెక్షన్ విండో ఓపెన్ కానుంది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు కరెక్షన్స్‌కు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 30న ఎగ్జామ్ సిటీ స్లిప్ రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేయనున్నారు. సీయూఈటీ-2023 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మే 21న ప్రారంభమై, మే 31వ తేదీన ముగియనున్నాయి.

* 13 ప్రాంతీయ భాషల్లో

సీయూఈటీ యూజీ-2023 పరీక్షలను అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు కోసం దేశవ్యాప్తంగా 1000 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజూ 450 నుంచి 500 సెంటర్లను పరీక్ష కోసం వినియోగించనున్నారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు