హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET UG 2022 Results: ఈ రోజే సీయూసెట్ యూజీ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్.. పూర్తి వివరాలివే

CUET UG 2022 Results: ఈ రోజే సీయూసెట్ యూజీ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూసెట్ యూజీ-2022 కు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. అభ్యర్థులు https://cuet.samarth.ac.in/ లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi | Hyderabad | Vijayawada

    దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ యూనివర్సిటీల్లో యూజీ (UG) ప్రవేశాల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET UG -2022 పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు (Exam Results) ఈ రోజు విడుదల కానున్నాయి. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ వెబ్ సైట్ నుంచి తమ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూజీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు రాత్రి 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్ వెల్లడించారు. సీయూసెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు యూనివర్సిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో సారి సీయూసెట్-యూజీ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది.

    విద్యార్థులు cuet.samarth.ac.in వెబ్ సైట్ ఓపెన్ చేసి తమ అప్లికేషన్ ఫామ్ లో వివరాలను సరి చేసుకోవచ్చు. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ గత వారం మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూసెట్ యూజీ-2022 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కుదిరితే మరో రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఫలితాలను ఈ నెల 15న కూడా విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎట్టకేలకు ఈ రోజు రాత్రి 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు యూజీసీ ప్రకటించడంతో తమ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

    University of Madras: స్వదేశంలోనే ఉండి విదేశీ యూనివర్శిటీ గైడెన్స్‌తో చదివే ఛాన్స్.. పూర్తి వివరాలివే..

    ఈ స్టెప్స్ తో రిజల్ట్స్:

    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో లాగిన్ అవ్వాలి.

    Step 2: అనంతరం CUET UG 2022 Results లింక్ కనిపిస్తుంది.

    Step 3: ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అక్కడ రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

    Step 4: అనంతరం మీ స్కోర్ కార్డ్ డిస్ప్లే అవుతుంది.

    స్కోర్ కార్డును ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CUCET 2022, Exam results, Exams, JOBS

    ఉత్తమ కథలు