హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET UG 2022 Results: సీయూసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఏ క్షణమైనా రిజల్ట్స్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి

CUET UG 2022 Results: సీయూసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఏ క్షణమైనా రిజల్ట్స్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూసెట్ యూజీ-2022 కు సంబంధించిన ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు https://cuet.samarth.ac.in/ లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Delhi | Vijayawada

  దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ యూనివర్సిటీల్లో యూజీ (UG) ప్రవేశాల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET UG -2022 పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు (Exam Results) ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ వెబ్ సైట్ నుంచి తమ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సీయూసెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు యూనివర్సిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో సారి సీయూసెట్-యూజీ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది.

  విద్యార్థులు cuet.samarth.ac.in వెబ్ సైట్ ఓపెన్ చేసి తమ అప్లికేషన్ ఫామ్ లో వివరాలను సరి చేసుకోవచ్చు. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ గత వారం మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూసెట్ యూజీ-2022 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కుదిరితే మరో రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

  University of Madras: స్వదేశంలోనే ఉండి విదేశీ యూనివర్శిటీ గైడెన్స్‌తో చదివే ఛాన్స్.. పూర్తి వివరాలివే..

  ఈ స్టెప్స్ తో రిజల్ట్స్:

  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in లో లాగిన్ అవ్వాలి.

  Step 2: అనంతరం CUET UG 2022 Results లింక్ కనిపిస్తుంది.

  Step 3: ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అక్కడ సూచించిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

  Step 4: అనంతరం మీ స్కోర్ కార్డ్ డిస్ప్లే అవుతుంది.

  స్కోర్ కార్డును ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

  సీయూసెట్ ఆన్సర్ కీ డౌన్ లోడ్ ఇలా:

  Step 1: అభ్యర్థులు మొదటగా cuet.samarth.ac.in వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి.

  Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే.. CUET UG 2022 Provisional Answer Key Download లింక్ పై క్లిక్ చేయాలి.

  Step 3: అనంతరం రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేయాలి.

  Step 4: అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 5: తర్వాత మీ ఆన్సర్ కీ హోం స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది.

  Step 6: అభ్యర్థులు ఆ ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, CUCET 2022, Exam results, JOBS

  ఉత్తమ కథలు