CUET PREPARATION TIPS LOOKING FOR THE BEST RESULT IN CUET ON THE FIRST TRY FOLLOW THESE TIPS GH VB
CUET Preparation Tips: మొదటి ప్రయత్నంలోనే CUETలో బెస్ట్ రిజల్ట్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటిసారిగా ఈ ఏడాది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ను నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో పరీక్ష జరగనుంది.
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో(University) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(Under Graduate Course) ప్రవేశాల కోసం మొదటిసారిగా ఈ ఏడాది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ను నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్-టైప్‌లో(Objective Type) ఉంటుంది. చాలా యూనివర్సిటీలు(Universities) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్(Admission) ప్రక్రియను CUCET స్కోర్ ఆధారంగా చేపడుతున్నాయి. దీంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. CUET -2022కి అర్హత పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులను స్కోర్ చేయాల్సి ఉంటుంది. జూలై మొదటి వారంలో పరీక్ష ప్రారంభం కానుంది.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
CUET-2022 కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు పలు కీలక విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలి. కొన్ని కీలక అంశాలపై పట్టు సాధించాలి.
సిలబస్‌పై పూర్తి అవగాహన
పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి సెక్షన్లో లాంగ్వేజ్‌లు ఉంటాయి. రెండో సెక్షన్లో స్పెసిఫిక్ డొమైన్ సబ్జెక్టులు ఉంటాయి. చివరిది మూడో సెక్షన్ జనరల్ ఎబిలిటీపై ఉంటుంది. ప్రతి విభాగం నుండి ప్రశ్నలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12వ తరగతికి చెందిన NCERT సిలబస్ ఆధారంగా పరీక్షలో ప్రశ్నలు ఉండనున్నాయి. 12వ తరగతి చదివిన ప్రకారం విద్యార్థులు లాంగ్వేజ్, కోర్సులను ఎంచుకుంటే మంచిది. అయితే, ఏదైనా యూనివర్సిటీ ఈ విషయంలో ప్రత్యేక సౌలభ్యాన్ని కల్పిస్తే, CUET ద్వారా అమలు చేయనున్నారు.
* క్రిటికల్ థింకింగ్
విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే సిలబస్‌లోని ప్రతి టాపిక్‌ను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు రోటీన్ లెర్నింగ్ పెద్దగా ఉపయోగపడదు. పైగా పరీక్ష మల్టిపుల్ చాయిస్ క్వశ్వన్ రూపంలో ఉండనుంది. దీంతో సిలబస్‌ను కాన్సెప్ట్ వారీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం విమర్శనాత్మక ఆలోచన, సమగ్ర నైపుణ్యాలు నిర్ణయాత్మక సామర్థ్యంపై ఎక్కువ దృష్టి సారించాలి. దీంతో మంచి పరీక్షలో మంచి స్కోర్ సాధించడానికి స్కోప్ ఉంటుంది.
టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్
సీయూఈటీ పరీక్ష ఆన్లైన్ మోడ్‌లో జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా పరీక్షను ఎదుర్కొవాలంటే ప్రాక్టీస్ ఎంతో అవసరం. పేపర్ ప్యాటర్న్ అనుసరించి వీలైనన్ని టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. ఇందు కోసం అనేక సంస్థల వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఉచిత నమూనా పేపర్ సహాయంతో ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే ఆన్లైన్ టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్ ఎలా పనిచేస్తుందనే దానిపై అవగాహన పెంచుకోవచ్చు
ప్రశాంతంగా ఉండడం
సీయూఈటీ మొట్టమొదటిసారిగా ఈ ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పరీక్ష అందరికీ కొత్తగా అనిపిస్తుంది. ఈ కారణంగా విద్యార్థులు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే పరీక్ష సిలబస్‌పై పూర్తి దృష్టి పెట్టండి. NCERT పుస్తకాల ప్రిపరేషన్‌తో పరీక్షకు సిద్ధంగా ఉండండి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉంటే పరీక్ష ఎలా ఉన్నా ఈజీగా ఎదుర్కొవచ్చు.
డైలీ రొటీన్
మీకు నచ్చిన ప్రకారమే మీ డైలీ రొటీన్, ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రారంభించండి. ప్రిపరేషన్‌కు గరిష్టంగా రోజుకు రెండు గంటల సమయం ఇవ్వండి. బోర్డు పరీక్షల సమయంలో మీ ఫోకస్ బోర్డ్ ఎగ్జామ్లపైకి మార్చవచ్చు. అయితే సమయం దొరికినప్పుడల్లా మీ వ్యూహాన్ని మార్చుకోండి. CUET కోసం ఎక్కువ దృష్టి పెట్టండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.