దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ (Central Universities)ల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET-PG) పరీక్షను నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీయూఈటీ పీజీ-2023 పరీక్షల వివరాలను యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఎగ్జామ్‌లు జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుంది. సీయూఈటీ-పీజీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తుంది.
* గతేడాది 66 వర్సిటీల్లో ప్రవేశం
సీయూఈటీ పరీక్ష కంప్యూటర్ బేస్ట్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరగనుంది. గతేడాది దేశవ్యాప్తంగా 66 యూనివర్సిటీలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాయి. వీటిలో ఎక్కువ యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లో ఉన్నాయి. సీయూఈటీ -2022 పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 12 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరిగాయి. 500కు పైగా భారతీయ నగరాలు, 13 విదేశీ సెంటర్స్‌లో ఈ పరీక్ష జరిగింది.
CUET PG 2022లో పొందిన మార్కుల ఆధారంగా, యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం అడ్మిషన్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ(DU) వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి సీయూఈటీ ద్వారా యూజీతో పాటు పీజీ అడ్మిషన్స్ చేపట్టాలని నిర్ణయించింది. గత నెలలో యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ సరళిని మార్చే ప్రతిపాదనను ఆమోదించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ సరళిలో మార్పును 2023-2024 నుంచి అమలు చేయనున్నారు.
* మే నుంచి సీయూఈటీ యూజీ పరీక్షలు
సీయూఈటీ యూజీ-2023 పరీక్షలను ఎన్‌టీఏ మే 21 నుంచి 31 మధ్య ఆ తరువాత జూన్ 1 నుంచి 7 మధ్య జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుంది. పరీక్ష విధానం గతేడాది మాదిరి ఉంటుంది.
ఇది కూడా చదవండి : జనవరి 1 నుంచి అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ ట్రైనింగ్.. శిక్షణ వివరాలు ఇలా..
* సీయూఈటీ-2023 సిలబస్
గత ఏడాది మాదిరి 12వ తరగతికి సంబంధించిన టాపిక్స్ ఆధారంగా సీయూఈటీ-2023 సిలబస్ ఉంటుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు CUET సిలబస్‌ను పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో 13 భాషల్లో నిర్వహిస్తారు.
* ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు
సీయూఈటీ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ- న్యూఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా- న్యూఢిల్లీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ- కోల్‌కతా, అమృత విశ్వ విద్యాపీఠం-కోయంబత్తూరు, బనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్-మణిపాల్, కలకత్తా యూనివర్సిటీ- కోల్‌కత్తా, వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- వేలూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- హైదరాబాద్ వంటి యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central university, Cuet, EDUCATION, JOBS