CUET PG ADMISSIONS CUET MANAGEMENT FOR ADMISSIONS IN PG COURSES NOTIFICATION ISSUED AND EXAM IN JULY GH VB
CUET PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా CUET నిర్వహణ.. నోటిఫికేషన్ విడుదల.. ఆ నెలలో పరీక్ష..
ప్రతీకాత్మక చిత్రం
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు కూడా ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను (CUET) ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్(Post Graduate) కోర్సుల్లో అడ్మిషన్స్‌కు(Admissions) కూడా ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను (CUET) ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission) నిర్ణయించింది. సీయూఈటీ (Cuet) ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని యూజీసీ(UGC) తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18 వరకు కొనసాగుతుందని యూజీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ nta.ac.in, cucet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2022-23 విద్యాసంవత్సరానికి గానూ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జులై చివరి వారంలో.. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది.
కాగా 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. క్వశ్చన్ పేపర్ హిందీ లేదా ఇంగ్లీష్ ల్యాంగ్వేజులలో మాత్రమే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందడం సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ 2022లో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. 12వ తరగతి లేదా ఇంటర్లో సాధించిన మార్కులతో ప్రమేయం ఉండదని యూజీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. CUET-UG కోసం ఇప్పటివరకు 10.46 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్లు మే 22 తో ముగుస్తాయి.
సెంట్రల్ యూనివర్సిటీ సంఖ్య ఇంకా పెరిగి అవకాశం ఉందని అంచనా. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని వర్సిటీల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను వర్తింపచేయనున్నామని యూజీసీ ఛైర్ పర్సన్ జగదీష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు వివిధ విశ్వవిద్యాలయాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం వేర్వేరుగా అడ్మిషన్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోసం కూడా యూజీసీ సెంట్రల్ యూనివర్సిటీలను దాటి వెళ్లాలని భావిస్తున్నారు. అలాగే ప్రైవేట్ కళాశాలలు కూడా అడ్మిషన్లను అనుమతించే విధంగా సీయూఈటీని పరీక్ష ఉపయోగపడుతుంది. సీయూసీఈటీ యూజీ కోసం రిజిస్ట్రేషన్లు దక్షిణ రాష్ట్రాల నుంచి తక్కువగా ఉన్నాయని లెక్కలు పేర్కొన్నాయి. ఈ విషయం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.