Home /News /jobs /

CUET PG 2022 NTA EXTENDS APPLICATION DEADLINE TO JULY 10 HERES HOW TO APPLY AND KNOW FULL DETAILS HERE VB

CUET PG 2022: సీయూఈటీ PG 2022 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకు పెంచారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUET PG 2022: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్, CUET PG 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగించబడింది. CUET PG 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పొడిగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA ద్వారా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

ఇంకా చదవండి ...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(Common Entrance Test)-పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2022 రిజిస్ట్రేషన్ గడువును పెంచారు. తాజాగా CUET PG 2022 కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జూలై 10 వరకు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంతక ముందు NTA CUET PG కోసం దరఖాస్తు చేయడానికి చివరి రోజు జూలై 4గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పలు కారణాల వల్ల ఈ గడువును తాజాగా పొడిగించడం జరిగింది. దరఖాస్తు, పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ను చూడవచ్చు.

Cheapest Electric Scooters: అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..




CUET PG 2022: సవరించిన షెడ్యూల్
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ- జూలై 10, 2022
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- జూలై 11, 2022
కరెక్షన్ విండో ఓపెన్స్- జూలై 12, 2022
కరెక్షన్ విండో క్లోజ్- జూలై 14, 2022 



CUET PG 2022 దేశవ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించబడుతుంది. ఇవి కాకుండా, ఇతర ప్రైవేట్ మరియు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా CUET PG 2022 అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి.CUET PG 2022 జూలై నెలలోనే నిర్వహించబడుతుందని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విండో ముగిసిన తర్వాత ఖచ్చితమైన తేదీ మరియు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Travel Tips For Girls : అమ్మాయిలు వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే

CUET PG దరఖాస్తు దరఖాస్తు ఇలా..

Step 1: అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarth.ac.in లేదా cuet.nta.nic.in ఓపెన్ చేయాలి.

Step 2: హోమ్‌పేజీలో, CUET PG 2022 దరఖాస్తు ఆన్‌లైన్ బటన్‌పై క్లిక్ చేయండి.

Step 3: తదుపరి దశలో, అభ్యర్థులు వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, ఇతర వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవాలి.

Step 4: దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న వివరాలను క్రాస్-చెక్ చేయండి. ఫోటోగ్రాఫ్, సంతకం , స్కాన్ చేసిన కాపీ , ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

Step 5: CUET 2022 దరఖాస్తు రుసుమును చెల్లించి.. అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి.

Step 6: అప్లికేషన్ ఫారమ్ ను భవిష్యత్ అవసరాల కోరకు డౌన్ లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Cucet, CUCET 2022, CUET 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు