Home /News /jobs /

CUET FOR UG ADMISSIONS TO TOP COLLEGES FROM JULY 15 UMG GH

CUET- UG: ఆ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. అప్లికేషన్ కరెక్షన్‌కు అవకాశం..!

సీయూఈటీ అండర్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం.

సీయూఈటీ అండర్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం.

CUET- UG అప్లికేషన్ కరెక్షన్ విండోను NTA మరోసారి ఓపెన్ చేసింది. అప్లికేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న టాప్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET- UG) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31తోనే ముగిసింది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. అప్లికేషన్ కరెక్షన్ విండోను తాజాగా మరోసారి ఓపెన్ చేసింది. అప్లికేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చని NTA ప్రకటించింది. cuet.samarth.ac.in సైట్‌కు లాగిన్ అయ్యి, కొత్త అప్లికేషన్స్ సబ్‌మిట్ చేయవచ్చు. ఈ విండో జూన్ 23న మళ్లీ ఓపెన్ అయింది. జూన్ 24, 11:50 pm వరకు ఓపెన్ అయ్యే ఉంటుందని ఏజెన్సీ ప్రకటించింది.

జూలై 15, 16, 19, 20, ఆగస్టు 4, 5, 6, 7, 8, 10 తేదీల్లో CUET- UG టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇది కంప్యూటర్ బేస్ట్ టెస్ట్. దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రవేశానికి సెంటలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే అభ్యర్థుల డిమాండ్ మేరకు రిజిస్ట్రేషన్, కరెక్షన్ ప్రాసెస్ కోసం చివరిసారిగా విండోను ఓపెన్ చేస్తున్నట్లు NTA అధికారిక నోటీసులో తెలిపింది.

అప్లికేషన్ ఫారమ్‌ను ఎడిట్ విషయంలో.. అభ్యర్థులు మొబైల్ నంబర్‌, ఇమెయిల్ ఐడీ లేదా అడ్రస్ మార్చుకునే వీలుండదు. అయితే 10వ తరగతి, 12వ తరగతి వివరాలు, పరీక్ష కేంద్రం ఎంపిక, లాంగ్వేజ్ మీడియం, లింగ భేదం, వర్గం మొదలైనవాటిని మార్చుకోవచ్చు. అభ్యర్థులు 27 కోర్సుల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. 13 మీడియంలలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని పరీక్ష రాయవచ్చు. దీంతోపాటు ప్రతి ప్రశ్నను ఇంగ్లీష్‌లో కూడా ముద్రిస్తారు.



ఇప్పటి వరకు 9,50,804 మంది అభ్యర్థులు 86 వర్సిటీల్లో ప్రవేశాల కోసం నమోదు చేసుకున్నారు. వీటిలో 43 సెంట్రల్ యూనివర్సిటీలు, 13 స్టేట్ యూనివర్సిటీలు, 12 డీమ్డ్ యూనివర్సిటీలు, 18 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అప్లికేషన్ల పరంగా ఢిల్లీ యూనివర్సిటీకి 6 లక్షలకు పైగా దరఖాస్తులతో టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 3.94 లక్షల దరఖాస్తులతో BHU, 2.31 లక్షల దరఖాస్తులతో అలహాబాద్ యూనివర్సిటీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈసారి దేశంలోని అన్ని ప్రధాన యూనివర్సిటీలు CUET 2022 స్కోర్ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నాయి.

CUCET-UG పరీక్షను రెండు భాగాలుగా నిర్వహిస్తారు. పార్ట్ Aలో ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్/డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఎనలిటికల్ స్కిల్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి, పార్ట్ Bలో సబ్జెక్ట్స్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష టైమ్ 2 గంటలు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలకు నాలుగు మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, CUET 2022, JOBS, Under graduation

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు