సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్ జగదీష్ కుమార్. ఈ ఎగ్జామ్ బోర్డు పరీక్షలను అసంబద్ధం చేయదని, కోచింగ్ సెంటర్లకు (Coaching Centers) ప్రాధాన్యం కల్పించదని మంగళవారం చెప్పారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు (Students) సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. ఈ క్రమంలో వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.
పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ కేవలం సెంట్రల్ యూనివర్సిటీలలో అడ్మిషన్లకే పరిమితం కాదు. అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో స్కోర్‌లను ఉపయోగించుకోవాలని, బోర్డులోకి రావాలని సూచించాయి.
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఏడాది ఒకసారే నిర్వహిస్తాం. అయితే తదుపరి సెషన్ నుంచి సంవత్సరానికి కనీసం రెండుసార్లు పరీక్షను నిర్వహించే యోచనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. ప్రవేశ పరీక్ష కేవలం సెంట్రల్ యూనివర్సిటీలకే పరిమితం కాకుండా ప్రైవేట్ వర్సిటీలకు కూడా ఉంటుంది. అనేక ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తాము బోర్డులోకి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులను చేర్చుకోవాలనుకుంటున్నట్లు సూచించాయి.’ అని చెప్పారు.
ISRO Jobs: ఇస్రో-ఐఐఆర్ఎస్‌లో జాబ్స్.. వేతనం రూ. 56,100.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి స్కోర్ తప్ప 12వ తరగతి స్కోర్‌లు కాదని కుమార్ గత వారం ప్రకటించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వాటి కనీస అర్హత ప్రమాణాలను నిర్ణయించుకోవచ్చని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నిర్వహించే పరీక్ష కోచింగ్ కల్చర్ కి దారితీస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. జగదీష్ కుమార్ స్పందిస్తూ.. ‘పరీక్షకు ఎటువంటి కోచింగ్ అవసరం లేదు.
Govt Jobs 2022: సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్స్.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక, అర్హతలు!
కాబట్టి ఇది కోచింగ్ సంస్కృతిని పెంపొందించే అవకాశం లేదు. పరీక్ష పూర్తిగా 12వ తరగతి సిలబస్‌పై ఆధారపడి ఉంటుంది. పరీక్షలో 11వ తరగతి సిలబస్ (Syllabus) నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయా? లేదా? అని చాలా మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 11వ తరగతి నుంచి ఎలాంటి ప్రశ్నలు పరీక్షలో రావు.’ అని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.