Home /News /jobs /

CUET CONDUCTED FOR ADMISSION IN UNIVERSITIES THINGS TO KNOW ABOUT THIS ENTRANCE EXAM GH VB

CUET: సీయూఈటీకి దరఖాస్తు చేస్తున్నారా..? అయితే ఈ ఎగ్జామ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) పరీక్షను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్ష ద్వారా 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జూలై మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
సెంట్రల్ యూనివర్సిటీల్లో(Central Universities) ప్రవేశాల కోసం యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) పరీక్షను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్ష ద్వారా 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జూలై మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. CUET కోసం ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీగా ఏప్రిల్ 30ని నిర్ణయించారు. జాతీయ విద్యా విధానం2020 సూచించిన విధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. గతంలోనూ ఇలాంటి పరీక్షను నిర్వహించారు. 2010లో అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate), పోస్ట్ గ్రాడ్యుయేట్(Post Graduate) & ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో(Integrated Courses) 1,500 సీట్లను భర్తీ చేయడానికి 7 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను మొదటిసారి నిర్వహించారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అస్సాం యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, హర్యానా యూనివర్సిటీ తదితర 12 సెంట్రల్ యూనివర్సిటీలు CUET ద్వారా అడ్మిషన్లు చేపట్టాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.

Multibagger Stock: ఏడాదిలో 150 శాతం పెరిగిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం..!


CUET పరీక్షను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో లాంగ్వేజ్‌లపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. రెండో విభాగంలో డొమైన్‌లోని నిర్దిష్టమైన సబ్జెక్ట్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇక చివరి మూడో విభాగంలో జనరల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఉండనున్నాయి.

లాంగ్వేజ్ విభాగాన్ని మరో రెండు భాగాలుగా సెక్షన్ 1A, 1Bగా విభజించారు. 1Aలో 13 లాంగ్వేజ్‌లపై ప్రశ్నాపత్రం ఉండనుంది. సెక్షన్ 1Bలో 19 లాంగ్వేజ్‌లపై ప్రశ్నలు ఉండనున్నాయి. ఏ విద్యార్థి అయిన ఓ నిర్దిష్ట లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, లాంగ్వేజ్ పేపర్ ఫారమ్ 1Bని ఎంచుకోవాలి. సెక్షన్ 1A , 1B నుండి గరిష్టంగా ఏదైనా మూడు భాషలను ప్రతి విద్యార్థి ఎంచుకోవచ్చు.

డొమైన్ ప్రత్యేక విభాగంలో 27 సబ్జెక్టులు ఉంటాయి. ఒక విద్యార్థి గరిష్టంగా 6 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. డొమైన్ ప్రత్యేక లిస్టులో ఏదైనా సబ్జెక్ట్ లేకపోతే, డొమైన్ జాబితాకు చాలా దగ్గరి సంబంధం ఉన్న సబ్జెక్ట్‌ను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థి బయోటెక్నాలజీలో ప్రవేశం కోరుతున్నట్లయితే, వారు జీవశాస్త్రాన్ని ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు.

జనరల్ టెస్ట్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్‌తో సహా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి.

Electric Vehicles: రెండేళ్లు ఆగండి.. ఎలక్ట్రిక్ వాహనాలపై మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..


అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. సిలబస్‌ను తొందరగా పూర్తి చేయడం కంటే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడం, విమర్శనాత్మక ఆలోచన, సమగ్ర నైపుణ్యాలు & నిర్ణయాత్మక సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా సంప్రదాయ విద్యా నమూనాను ఇది మారుస్తుంది. ఈ సంస్కరణ ప్రక్రియ విద్యార్థులు, కళాశాలలు & యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యా వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒకే గొడుగు విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులందరికీ సమానమైన అవకాశాలు ఉండనున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Admissions, Career and Courses, CUCET 2022, Cuet, CUET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు