Home /News /jobs /

CUET APPLICATION DEADLINE EXTENSION AND NEAT REGISTRATION PROCESS WILL BE FURTHER DELAYED DETAILS HERE GH VB

CUET vs NEET: సీయూఈటీ దరఖాస్తు తేదీ గడువు పొడిగింపు... నీట్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ను నిర్వహించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతుందని NTA గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతం వాయిదా వేసింది.

ఇంకా చదవండి ...
దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ను నిర్వహించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతుందని NTA గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతం వాయిదా వేసింది. ఏప్రిల్ 6 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. మరోవైపు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దరఖాస్తు ప్రక్రియ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

ఏప్రిల్ మొదటి వారంలో నీట్ 2022 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభవుతుందని NTA గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్న విషయాన్ని ఏజెన్సీ స్పష్టం చేయలేదు. CUET 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 6న ప్రారంభం కానుంది. ఆ తరువాతనే NEET 2022 దరఖాస్తు ఫారమ్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఔత్సాహికులు CUET ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ, JNU వంటి సెంట్రల్ యూనివర్సిటీలలో అడ్మిషన్లు సాధించవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం NEET నిర్వహించనున్నారు. జూలై 17న, సీయూఈటీని జూలై మొదటి, రెండో వారంలో నీట్ నిర్వహించే అవకాశం ఉంది.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. రెండు రోజులే చాన్స్

CUET 2022 దరఖాస్తు విధానం

స్టెప్ 1: CUET అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

స్టెప్ 2: CUET 2022 అప్లికేషన్ లింక్‌‌పై క్లిక్ చేయండి

స్టెప్ 3: అవసరమైన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి

స్టెప్ 4: అనంతరం దరఖాస్తు రుసుము చెల్లించండి

స్టెప్ 5: భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోని సేవ్ చేయండి

NEET 2022 దరఖాస్తు విధానం

స్టెప్ 1: నీట్-2022 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్టెప్ 2: మీ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో రిజిస్ర్టర్ చేసుకోండి

స్టెప్ 3: ఫిల్ అప్లికేషన్ ఫారం దానిపై క్లిక్ చేయండి

స్టెప్ 4: వ్యక్తిగత సమాచారం, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, విద్యార్హత, ఇతర వివరాలను నమోదు చేయండి

స్టెప్ 5: అప్‌డేట్ కోసం కాంటాక్ట్ వివరాలను నమోదు చేయండి

స్టెప్ 6: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజును చెల్లించండి

స్టెప్ 7: అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి

CUET 2022: పరీక్షా విధానం
CUET కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్‌లో పరీక్ష జరగనుంది. IA, IB, II, III అనే నాలుగు సెషన్‌లలో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష మొదటి స్లాట్ 195 నిమిషాలు కాగా, రెండో స్లాట్ 225 నిమిషాల పాటు జరగనుంది. పేపర్ మీడియం 13 భాషల్లో ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూలో ఉంటుంది.

నీట్ 2022: పరీక్షా విధానం
నీట్ పరీక్ష రెండు విభాగాలుగా విభజించారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ Aలో 35 ప్రశ్నలు, సెక్షన్ Bలో 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15 ప్రశ్నలలో, అభ్యర్థులు ఏవైనా 10 ప్రశ్నలను ప్రయత్నించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Cuet, NEET

తదుపరి వార్తలు