CUET-2023 : ఇంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్(Entrance Exams) నిర్వహించేవి. కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను ప్రాతిపదికగా తీసుకొనేవి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో(Central Universities) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET)ను నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఈ ఎగ్జామ్‌ను అమలు చేస్తున్నారు. సీయూఈటీ-2023 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలో విడుదల చేయనుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సీయూఈటీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. సబ్జెక్టుల ప్రకారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన సెంట్రల్ యూనివర్సిటీలు CUET స్కోర్ ఆధారంగా వివిధ UG కోర్సులకు ప్రవేశాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
సీయూఈటీ-2023 సిలబస్
గత ఏడాది మాదిరిగా 12వ తరగతికి సంబంధించిన టాపిక్స్ ఆధారంగా సీయూఈటీ-2023 సిలబస్ ఉంటుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు CUET సిలబస్‌ను పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. సీయూఈటీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ఆన్లైన్ మోడ్‌లో 13 భాషల్లో పరీక్ష జరుగుతుంది.
ఇంకా విడుదల కాని సిలబస్
సీయూఈటీ-2023 సిలబస్ PDF ఇంకా విడుదల కాలేదు. అయితే గతేడాదితో పోలిస్తే సిలబస్‌లో పెద్దగా మార్పులు ఉండవని నిపుణులు భావిస్తున్నారు. CUET సిలబస్‌లో జనరల్, సబ్జెక్ట్ రిలేటెడ్ వంటి రెండు డొమైన్స్ ఉంటాయి. జనరల్ సెక్షన్లో.. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ (బేసిక్ మాథ్యమాటికల్ కాన్సెప్ట్స్ సింపుల్ అప్లికేషన్స్ అర్థమెటిక్/ఆల్జీబ్రా జామెట్రీ/మెన్సురేషన్/స్టాట్(8వ తరగతి వరకు)) లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్ట్-స్పెసిఫిక్ సెక్షన్.. ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్స్ సెట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్ వంటి సబ్జె్క్టులకు చెందిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. సీయూఈటీ-2023 ప్రశ్నాపత్రం మల్టిపుల్ - ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించనున్నారు.
అద్దె బాయ్‌ఫ్రెండ్ నుండి బీర్ తాగడం వరకు..ప్రపంచంలోని విచిత్రమైన ఉద్యోగాలు
ప్రవేశాలు కల్పించే టాప్ యూనివర్సిటీలు
సీయూఈటీ స్కోర్ ఆధారంగా చాలా వర్సిటీలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ- న్యూఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా- న్యూఢిల్లీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ- కోల్‌కతా, అమృత విశ్వ విద్యాపీఠం- కోయంబత్తూరు, బనారస్ హిందూ యూనివర్సిటీ- వారణాసి, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్- మణిపాల్, కలకత్తా యూనివర్సిటీ- కోల్‌కతా, వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- వేలూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- హైదరాబాద్ వంటి యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పించనున్నాయి.
అంతేకాకుండా మిరాండా హౌస్- న్యూఢిల్లీ, హిందూ కళాశాల- న్యూఢిల్లీ, ప్రెసిడెన్సీ కాలేజీ- చెన్నై, లయోలా కళాశాల- చెన్నై, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్- న్యూఢిల్లీ, పీఎస్జీఆర్ కృష్ణమ్మాళ్ మహిళా కళాశాల- కోయంబత్తూరు, ఆత్మరామ్ సనాతన్ ధర్మ కళాశాల- న్యూఢిల్లీ, సెయింట్ జేవియర్స్ కాలేజ్- కోల్‌కతా, రామకృష్ణ మిషన్ విద్యామందిర- హౌరా, హన్స్‌రాజ్ కాలేజ్- న్యూఢిల్లీ వంటి టాప్ కాలేజీలు సైతం సీయూఈటీ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cuet